
సింగర్ ఆత్మహత్యాయత్నం..
ఎలుకల మందు తిని ఓ ఫోక్ సింగర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన..
న్యూఢిల్లీ: ఎలుకల మందు తిని ఓ ఫోక్ సింగర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నైరుతీ ఢిల్లీలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన సింగర్ సప్నా చౌదరి ఈ ఏడాది ఫిబ్రవరిలో పాడిన పాటల్లో కొన్నిపదాలు దళితులను కించపరిచేవిధంగా ఉన్నాయని సప్తల్ కున్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమెపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు ఫైల్ చేసిన వ్యక్తి సోషల్ మీడియా, వాట్సాప్ లలో సింగర్ పై దుష్ప్రచారం చేయడంతో ఆమె మనస్తాపానికి గురైందని చెప్పారు. గుడ్ గావ్ లోని సింగర్ ఇంటి నుంచి లభ్యమైన సూసైట్ నోట్ లో ఆమె ఈ విషయాన్ని పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.