స్థానిక మడితాడు గ్రామపంచాయితి ఉపర్పరపల్లి పొలాలసమీపంలో ఆటోడ్రై వర్ తమ్మిశెట్టి వెంకటరమణ (30) హత్యకు గురయ్యాడు.
సుండుపల్లిః స్థానిక మడితాడు గ్రామపంచాయితి ఉపర్పరపల్లి పొలాలసమీపంలో ఆటోడ్రై వర్ తమ్మిశెట్టి వెంకటరమణ (30) హత్యకు గురయ్యాడు. మతుడు సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లి కొత్తవడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. అయితే మతుని భార్య తమ్మిశెట్టి సంపూర్ణ ఇచ్చిన పిర్యాదులో అదేగ్రామానికి చెందిన నరసింహులు, భార్య, కుమారుడు ముగ్గురూకలిసి పాతకక్షలు మనస్సులో ఉంచుకొని హత్యచేశారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదులో తెలిపింది.
అదేవిధంగా శుక్రవారం ఉదయం 7గంటల సమయంలో ఆటోతీసుకొని బయలుదేరి వెల్లాడని అనంతరం మధ్యాహ్నం ఫోన్‌చేస్తే ఫోన్‌రింగు అవుతుందికానీ ఫోన్ ఎత్తలేదని చివరికి సుండుపల్లిలో హత్యకు గురైనట్లు తెలిసింది. అలాగే మతునికి తల్లి, భార్యతోపాటు రెండు సంవత్సరాల వయస్సుకల్గిన చిన్నారి ఉన్నది. ఉదయం ఉప్పరపల్లికి చెందిన మహిళ పొలాలసమీపంలోకి వెల్లగా మతదేహం కన్పించడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫోన్‌ద్వారా తెలియపర్చింది. దీంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మతదేహాన్ని పరిశీలించారు.
మృతుని తల్లి భోరున విలపిస్తోంది. కుమారుడు కొద్దిరోజులక్రితమే రూ.2లక్షలు తీసుకొని ఆటో కొనుక్కున్నాడని చివరికి ఇలా హత్యకు గురయ్యాడని భోరున విలపిస్తోంది. మతునిభార్య సంపూర్ణ భోరున విలపించడం జరిగింది. తమ్మిశెట్టి వెంకటరమణను మార్గమధ్యంలో చంపివేసి మతున్ని ఆటోలో తీసుకొచ్చారా లేకపోతే ఆటోబాడుగకు తీసుకువచ్చి హత్యచేశారా? అన్న విషయాలు పోలీసుల విచారణలో తేలనుంది.