బొల్లం శివరామ్ (ఫైల్)..
బంజారాహిల్స్ (హైదరాబాద్): తనపై మోపిన దొంగ అనే ముద్రను భరించలేక ఓ యువకుడు మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్ నగర్ బస్తీలో నివసించే బొల్లం శివరాం(30) మణికొండలోని రిలయన్స్ జియో మార్ట్ హబ్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల ఈ హబ్‌లో రూ. 2 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఇక్కడ పని చేస్తున్న సంతోష్ అనే ఉద్యోగి ఈ నెపాన్ని శివరాంపై మోపాడు.
తాను అలాంటి పని చేయలేదని మనస్తాపానికి గురైన శివరాం సూసైడ్ నోట్ రాసి గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.2 లక్షలు కట్టాలంటూ ఒత్తిడి తీసుకురావడమే కాకుండా తనను దొంగ అనడాన్ని భరించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను ఒక్క రూపాయి కూడా తీయలేదని ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. దీంతో మృతుడి భార్య మీనాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హబ్ నిర్వాహకుడు సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment