sivaram
-
ప్రవల్లిక కేసు: సరైన ఆధారాలు లేవు.. శివరామ్‌కు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌కు నాంపల్లి కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. రూ.5 వేల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ ఇస్తూ ఆదేశాలిచ్చింది. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు.. ప్రవల్లిక ఆత్మహత్య కేసులో శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది. మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివరామ్ రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా చిక్కడపల్లి పోలీసులు ఇతడి కోసం ముమ్మరంగా గాలించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధం కావడానికి నగరానికి వచ్చి అశోక్‌నగర్‌లోని బృందావన్ హాస్టల్లో ఉంటోంది. గతవారం ఆమె హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉదంతంపై పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ప్రవల్లిక రూమ్‌లో సోదా చేసిన అధికారులకు సూసైడ్ నోట్ లభించింది. ఆమె సెల్‌ఫోన్‌ను సీజ్ చేసి అందులోని అంశాలను విశ్లేషించగా ఆత్మహత్యకు గల కారణాలు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి ప్రాంతానికి చెందిన శివరామ్ రాథోడ్ అనే యువకుడితో వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అతడికి ఆమె రాసిన ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించిన పోలీసులు శివరామ్ రాథోడ్‌కు మరో యువతితో వివాహం నిశ్చయం కావడంతో ప్రవల్లిక తాను మోసపోయానని కుంగిపోయినట్లు తేల్చారు. ఈ మేరకు ప్రవల్లిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. సోమవారం నగరానికి వచ్చిన ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడమేకాకుండా సందేశాల ప్రింటవుట్స్ సైతం అందించారు. వీటి ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును మార్చారు. ఐసీపీలోని 417, 420, 306 సెక్షన్లు జోడిస్తూ శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి గాలిస్తున్న ప్రత్యేక బృందాలకు గురువారం మహారాష్ట్రలో అతడు చిక్కి నట్లు వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే శివరామ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో తన న్యాయవాది ద్వారా సరెండర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కోర్టు అనుమతించడంతో లొంగిపోయాడు. అయితే, ఈ కేసుపై శనివారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. శివరామ్ పాత్రపై సరైన ఆధారాలు లేవంటూ బెయిల్ మంజూరు చేసింది. చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య -
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్.. సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. శివరాం పిటిషన్‌కు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి శివరామ్ చేతిలో మోసపోయా నన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. చదవండి: మెట్రోలో కోతి చేష్టలు -
ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరామ్ రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి శివరామ్ చేతిలో మోసపోయా నన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు స్పందించారు. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రవల్లిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ మాట్లాడిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. వీడియోలో ఏముందంటే.. ‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవల్లిక. రెండేళ్ల నుంచి నా బిడ్డ, నా కొడు కును హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్నా.. మేము కాయకష్టం చేసుకుని చదివిస్తున్నం. మా పిల్లలకు కష్టం రాకూడదని హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్న. నా బిడ్డను వాడు వేధించాడు. వాడి టార్చర్‌ను మా అమ్మాయి మాతో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డ చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడు బయటికి రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రావద్దు. మీకు, మీ పార్టీలకు గొడవలు ఉంటే మీరే చూసుకోండి .. మా కుటుంబాన్ని నా బిడ్డ చావును అందులోకి లాగకండి. నా బిడ్డ ఉరి వేసుకున్నట్టే వాడికి ఉరిశిక్ష పడాలి’ అని మర్రి విజయ వీడియో పోస్టు చేశారు. ‘ప్రవల్లిక చనిపోవడానికి కారణం శివరాం. మా అక్క స్నేహి తురాలి ద్వారా పరిచయమయ్యాడు. వేధించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక డిప్రెషన్లో పడింది. సూసైడ్ చేసుకుంది’ అని ప్రవల్లిక తమ్ముడు మర్రి ప్రణయ్‌కుమార్ మరో వీడియోలో పేర్కొన్నాడు. చదవండి: నా బిడ్డ చావుపై రాజకీయాలు చేయొద్దు -
నా బిడ్డ చావుపై రాజకీయాలు చేయొద్దు
దుగ్గొండి: ‘‘మీకు, మీ పార్టీలకు గొడవలు ఉంటే మీరే చూసుకోండి .. మా కుటుంబాన్ని నా బిడ్డ చావును అందులోకి లాగకండి’’ అంటూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని ప్రవల్లిక తల్లి మర్రి విజయ మాట్లాడిన మాటలు మంగళవారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు స్పందించారు. మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రవల్లిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ మాట్లాడిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. నా బిడ్డ చావును అందులోకి లాగకండి.. వీడియోలో ఏముందంటే.. ‘మా అమ్మాయి పేరు మర్రి ప్రవల్లిక. రెండేళ్ల నుంచి నా బిడ్డ, నా కొడు కును హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్నా.. మేము కాయకష్టం చేసుకుని చదివిస్తున్నం. మా పిల్లలకు కష్టం రాకూడదని హైదరాబాద్‌లోనే ఉంచి చదివిస్తున్న. నా బిడ్డను వాడు వేధించాడు. వాడి టార్చర్‌ను మా అమ్మాయి మాతో చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డ చావుకు కారణమైన వాడిని శిక్షించాలి. వాడు బయటికి రాకుండా చూడాలి. నా బిడ్డ కష్టం వేరే వాళ్లకు రావద్దు. మీకు, మీ పార్టీలకు గొడవలు ఉంటే మీరే చూసుకోండి .. మా కుటుంబాన్ని నా బిడ్డ చావును అందులోకి లాగకండి. నా బిడ్డ ఉరి వేసుకున్నట్టే వాడికి ఉరిశిక్ష పడాలి’ అని మర్రి విజయ వీడియో పోస్టు చేశారు. ‘ప్రవల్లిక చనిపోవడానికి కారణం శివరాం. మా అక్క స్నేహి తురాలి ద్వారా పరిచయమయ్యాడు. వేధించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక డిప్రెషన్లో పడింది. సూసైడ్ చేసుకుంది’ అని ప్రవల్లిక తమ్ముడు మర్రి ప్రణయ్‌కుమార్ మరో వీడియోలో పేర్కొన్నాడు. సీఎంను కలిసేందుకు వెళ్లారా? ప్రవల్లిక ఆత్మహత్య రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంప నలు సృష్టించడం.. ప్రభుత్వంపై పలు ఆరోపణలు రావడంతో.. సోమవారం ప్రవల్లిక తల్లిదండ్రులు మర్రి లింగయ్య, విజయ మంత్రి కేటీఆర్ నుంచి పిలుపురావడంతో సిరిసిల్ల వెళ్లి కలిసినట్లు వార్తలొ చ్చాయి. అదే రోజు రాత్రి వారు ఇంటికి తిరిగివచ్చి మంగళవారం ఉదయం 5వ రోజు పక్షికి పెట్టే కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ప్రకాష్ జవదేకర్ పరామర్శకు వస్తున్నారని సమాచారం వచ్చినా.. వారు కలవడా నికి నిరాకరించడంతో కిషన్‌రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నారు. పక్షి కార్యక్రమం ముగియగానే సీఎం కేసీఆర్‌ను కలవడానికి హైదరాబాద్‌కు వెళ్లినట్లు బంధువుల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఎక్కడ మాట్లాడారో తెలియదు కానీ వారి మాటలు చర్చాంశనీయమయ్యాయి. శివరామ్ కోసం వేట ముమ్మరం సాక్షి, హైదరాబాద్: ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరా బాద్ చిక్కడపల్లి పోలీ సులు ఆ మేరకు కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి శివరామ్ రాథోడ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. శివకుమార్ చేతిలో మోసపోయా నన్న విష యాన్ని ప్రవల్లిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సా ప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. పరారీలో ఉన్న నిందితుడు శివరామ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. -
'ఒక్క రూపాయి తీయలేదు.. మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నా'
బంజారాహిల్స్ (హైదరాబాద్): తనపై మోపిన దొంగ అనే ముద్రను భరించలేక ఓ యువకుడు మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్ నగర్ బస్తీలో నివసించే బొల్లం శివరాం(30) మణికొండలోని రిలయన్స్ జియో మార్ట్ హబ్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల ఈ హబ్‌లో రూ. 2 లక్షల నగదు కనిపించలేదు. దీంతో ఇక్కడ పని చేస్తున్న సంతోష్ అనే ఉద్యోగి ఈ నెపాన్ని శివరాంపై మోపాడు. తాను అలాంటి పని చేయలేదని మనస్తాపానికి గురైన శివరాం సూసైడ్ నోట్ రాసి గురువారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.2 లక్షలు కట్టాలంటూ ఒత్తిడి తీసుకురావడమే కాకుండా తనను దొంగ అనడాన్ని భరించలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. తాను ఒక్క రూపాయి కూడా తీయలేదని ఈ మెంటల్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. దీంతో మృతుడి భార్య మీనాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హబ్ నిర్వాహకుడు సంతోష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పబ్జీ ఆడొద్దన్నందుకు కుటుంబాన్నే కాల్చేశాడు..!) -
ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ!
‘మనసు అద్దం లాంటిది, మనం నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది’ దేవదాసు సినిమాలో భగవాన్ (పేకేటి) మాటలు.. జవహర్లాల్ నెహ్రూకి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు.. ఎన్టిఆర్ రాజకీయ రంగప్రవేశం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే అంటూ ఇందిరాగాంధీకి సూచించారు.... దర్శకనిర్మాతగా చేయి కాల్చుకున్నారు.. డిటెక్టివ్ కథలు రాశారు.. డాక్యుమెంటరీలు తీశారు.. జాతకాలు, సంఖ్యా శాస్త్రాలను విశ్వసించారు.. ఎనిమిది సంఖ్య తనకు పడదంటూ, 2006లో కన్నుమూశారు. పేకేటి శివరామ్ గురించి వారి పెద్ద కుమారుడు కృష్ణమోహన్ సాక్షికి వివరించారు. మనిషి అంటే మనీ ప్లస్ షి అనేవారు నాన్న. అన్నట్లుగానే అమ్మని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నాన్న పూర్తి పేరు పేకేటి శివరామ్. ప. గో. జిల్లా పేకేరులో 1918, అక్టోబరు 8న పుట్టారు. తాతగారు చిన్నప్పుడే పోవటంతో నాన్నగారు కష్టపడి ప్రైవేటుగా భీమవరంలో బిఏ చదువుకున్నారు. అమ్మ పేకేటి ప్రభావతి. మేం నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలం. నేనే పెద్ద అబ్బాయిని. నా పేరు పేకేటి కృష్ణమోహన్. తమ్ముడు పేకేటి రంగా సినిమాలలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. మిగతా తమ్ముళ్లు రంగారావు, వెంకటేశ్వరరావు, గోపాల్. అమ్మాయిలు రాజ్యలక్ష్మి, శాంతి, వరలక్ష్మి, పూర్ణిమ. అందరూ బిఏ చదివారు. నేను మాత్రం మెట్రిక్ వరకే చదివాను. నాన్నగారి పెంపకం వల్ల ఇప్పటికీ కుటుంబసభ్యులమంతా ఏడాదికోసారి తప్పనిసరిగా కలుస్తున్నాం. మంచి ఆరోగ్యం ఇచ్చారు... నా 18 వ ఏట, నాన్నగారు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని, ‘నేను నీకు స్నేహితుడిని, ఏ ఇబ్బందులు వచ్చినా నాతో నిర్మొహమాటంగా చెప్పు. నీ పైవాడిని చూసి అసూయపడకు, నీ కింద వాడిని చూసి సంతోషపడు’’ అని చెప్పేవారు. ఆయన చెప్పినదల్లా పాటిస్తున్నాం. నాన్న మాకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, అందరికీ మంచి ఆరోగ్యం, మంచి పేరు, సంఘంలో గౌరవం ఇచ్చారు. కష్టాలు ఎదుర్కోవాలన్నారు... నౌకల గురించి ‘జల ఉష’, ‘జల ప్రభ’ అని రెండు డాక్యుమెంటరీలు తీశారు. ‘రైజింగ్ సన్’ అని సంజయ్ గాంధీ మీద డాక్యుమెంటరీ రూపొందించాలని నిశ్చయించుకున్నాక, ఆర్థిక ఇబ్బందులు వచ్చి, వడ్డే రమేశ్‌గారిని అడిగారు. ఆయన నాలుగు రోజులయ్యాక రమ్మన్నారు. నాలుగు రోజుల తరవాత నాన్న నన్ను పంపితే, నేను వెళ్లాను. అప్పుడు ఆయన ‘మా అకౌంటెంట్ బ్యాంక్‌కి వెళ్లాడు, కాసేపు ఆగు’ అన్నారు. సరిగ్గా అప్పుడే వార్తాపత్రికలలో సంజయ్‌గాంధీ మరణించాడనే వార్త కనిపించింది. నేను నిరాశ చెందాను. అప్పుడు నాన్న నాతో, ‘ఎప్పుడూ అనుకున్నది అనుకున్నట్లుగా జరగదు. సుఖాలే ఎల్లకాలం ఉండవు’ అంటూ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండేవారు కాదు. కాంగ్రెస్ పార్టీ, షూటింగులలో తలమునకలై ఉండేవారు. ఇంట్లో ఉండకపోయినా పిల్లలకు ఏ లోటూ రానివ్వలేదు. కరివేపాకులా వాడుకున్నారు.. ఒకరోజు స్కూల్ నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాను. అప్పట్లో నాన్న సినిమాల్లో నటిస్తున్నారు. ఆయనకు కారులో క్యారేజీ పంపేవారు. ఆ రోజు క్యారేజీతో పాటు నేను కూడా షూటింగ్ స్పాట్‌కి వెళ్లాను. ఆ సమయంలో పుల్లయ్యగారు వెంకటేశ్వర మహాత్మ్యం సినిమా తీస్తున్నారు. నేను షూటింగ్ చూడటానికి వచ్చానని తిట్టి, నాన్న నన్ను అదే కారులో ఇంటికి పంపేశారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు బాగా గుర్తు. మరోసారి నాన్నను, ‘నువ్వు సినిమాలు ఎందుకు తీయట్లేదు’ అని అడిగాను. అందుకు ఆయన , ‘నువ్వు రోజుకి మూడుసార్లు భోజనం చేస్తున్నావు, నీకు ఇలా తినటం ఇష్టం లేదా’ అన్నారు. ఆ రోజు నుంచి నాన్నను ఎన్నడూ అడగలేదు. ప్రతిఫలం ఆశించకుండా ఎంతోమందికి సహాయం చేశారు. ఆయనను అందరూ అభిమానించేవారు. సినీ పరిశ్రమలో ఆయనను చాలామంది కరివేపాకులా వాడుకున్నారు. ఎంతో సంపాదించుకున్నా ఏమీ మిగుల్చుకోలేకపోయారు. చాలా భయం.. నాన్నగారంటే ఎంత భయమో అంత గౌరవం. ఆయన సినిమాలలో బిజీగా ఉండటం వల్ల ఇంటి విషయాలు అమ్మే చూసుకునేది. అద్దె ఇంట్లో ఉంటున్న రోజుల్లో నాన్నకు జీతం రాగానే.. ఇంటి అద్దె, పనిమనిషి జీతం, సరుకుల కోసం.. అంటూ డబ్బుల్ని విడివిడిగా ప్యాక్ చేసేది. అమ్మ చదువుకోక పోయినా, ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ, నాన్నకు సహాయంగా ఉండేది. ఆయనకు ఇష్టమైన వంటలు చేసేది. తల్లి నవ మాసాలు మోసి పెంచుతుంది. ఆ ప్రేమ నీళ్లలాంటిది. కంటికి కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కనపడదు. నాన్న ప్రేమ కూడా అంతే, బయటకు కనిపించేలా ఉండేది కాదు. తెలియని విద్య లేదు.. నాన్నగారు కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూకి పర్సనల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తరవాత ఇందిరాగాంధీ సమయంలో, నాన్నను దక్షిణభారతదేశానికి పబ్లిసిటీ ఇన్చార్జిగా నియమించారు. ఎన్టిఆర్ పార్టీ పెట్టినప్పుడు, ఇందిరాగాంధీ నాన్నకు ఫోన్ చేసి, ఎన్టిఆర్ గురించి అడిగితే, 72 పేజీలు రిపోర్టు రాసి పంపారు. అది ఆవిడ చదివి, వాస్తవాలు తెలుసుకోవటం కోసం మూపనార్‌ను అడిగితే, ఆయన ప్రాబ్లమ్ లేదన్నారు. ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో ఎన్టిఆర్ ఘన విజయం సాధించి, ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ఇందిరాగాంధీ నాన్నను ఢిల్లీ పిలిపించి, ‘నీ మాట వినకుండా నేను తప్పు చేశాను’ అంటూ తన తప్పు ఒప్పుకున్నారని, నాన్న స్వయంగా చెప్పారు. కాంగ్రెస్‌లోనే.. డిటెక్టివ్ కథలు రాశారు. పోలీస్ వాళ్లకి డాక్యుమెంటరీలు తీసి ఇచ్చారు. ఆలిండియా ఎన్టిఆర్ ఫ్యాన్స్ ఆసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. నాన్నకి ఎన్‌టిఆర్‌తో ఎంతో స్నేహం వున్నా, ఆయన పార్టీలోకి ఆహ్వానించినా, కాంగ్రెస్‌ను విడిచిపెట్టలేదు. మా ఇంటికి భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వస్తుండేవారు. జగ్గయ్య, హీరో కృష్ణ గారి తల్లి, రాజసులోచన, షావుకారు జానకి మా ఇంట్లో ఏం జరిగినా వస్తుండేవారు. బంగారు పూలతో... అమ్మనాన్నలు మునిమనవలను చూశారు. ముని మనవడితో మా అమ్మనాన్నలకు బంగారుపూలతో అభిషేకం చేయించాం. ఒకసారి నాన్నతో ‘ఏ రోజు కాల్ షీట్ ఇస్తే, ఆ రోజు లక్ష ఒత్తుల నోము చేసుకుంటాను’ అంది అమ్మ. ఆయన నవ్వుతూ ‘అలాగే చిట్టీ’ అన్నారు. అమ్మను ‘చిట్టీ’ అనేవారు. అలా అమ్మ లక్ష ఒత్తుల నోము, పసుపు కొమ్ముల నోము చేసుకుంది. మంచి మిత్రులు.. ఒక రోజు రాత్రి నాన్న అనారోగ్యంతో బాధపడుతుంటే, జగ్గయ్య గారికి ఫోన్ చేసి, ‘మావయ్యా! నాన్నకు ఒంట్లో బాలేదు, హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలి’ అని చెప్పగానే ఆయన వచ్చి, నాన్నను హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అంతటి స్నేహం ఉండేది. నాన్నతో 65 ఏళ్లు, అమ్మతో 73 ఏళ్లు ఉండే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నా వయస్సు 77 సంవత్సరాలు. మూడు తరాల ప్రేమ వివాహాలు.. నాన్నగారు నటించిన సినిమాలలో దేవదాసు, వద్దంటే డబ్బు, చిరంజీవులు.. చాలా ఇష్టం. నాన్నది, నాది, మా పెద్దబ్బాయిది ప్రేమ వివాహాలు. ఆయన రోజూ ‘మెయిల్’ పేపర్ చదివేవారు. జాతకాల మీద నమ్మకం ఎక్కువ. సినిమా వాళ్లకి కూడా జాతకాలు చెప్పేవారు. న్యూమరాలజీని బట్టి, పేర్లు మార్చేవారు. ‘ఇది 2006, ఈ సంఖ్య నాకు పడదు. మీ నాన్న జీవితం అయిపోయింది’ అని డెత్‌ని ప్రిడిక్ట్ చేశారు. పదిహేను రోజులపాటు అనారోగ్యంతో బాధపడి, డిసెంబరు 30, 2006 వైకుంఠ ఏకాదశి నాటి రాత్రి కాలం చేశారు. ఆ రోజు అక్కినేని ఫోన్ చేసి, ‘బాబూ! నేను డెడ్ బాడీని చూడలేను, తరవాత వస్తాను. మీ ఆంటీ మాత్రం.. మంచి రోజు సెలవు తీసుకున్నారని చెప్పమంది. నాకు దేవుడి మీద నమ్మకాలు లేవు. ఆవిడ చెప్పమన్నది చెప్తున్నాను’ అన్నారు. నాన్న నటించిన చిత్రాలు దేవదాసు, వద్దంటే డబ్బు, గులేబకావళి కథ, వెలుగు నీడలు, బభ్రువాహన, సువర్ణసుందరి, భాగ్యరేఖ, చిరంజీవులు, పెళ్లినాటి ప్రమాణాలు, జయభేరి, వీర కంకణం, పాండురంగ మహాత్మ్యం, అనార్కలి, కన్యా శుల్కం, కుల గౌరవం, అల్లూరి సీతారామరాజు వంటి ఎన్నో చిత్రాలలో నటించి, తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. దేవదాసులోని భగవాన్, అల్లూరి సీతారామరాజులో డిప్యూటీ కలెక్టర్ పాత్రలు బాగా గుర్తింపు తెచ్చాయి. సంభాషణ: వైజయంతి పురాణపండ -
క్లాసిక్ పోలో ‘ఫాస్ట్ ఫ్యాషన్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్స్ రంగంలో ఫ్యాషన్‌ను ఫాలో అయితేనే రిటైలర్లు విజయవంతమవుతారు. ఇందులో భాగంగానే రాయల్ క్లాసిక్ మిల్స్ కొత్త కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. కొత్త డిజైన్లను ఎప్పటికప్పుడు కస్టమర్లకు చేరవేసేందుకు ఫాస్ట్ ఫ్యాషన్ పేరుతో రిటైలర్ల కోసం ఓ యాప్‌ను రూపొందించింది. టీ–షర్ట్స్, షర్ట్స్, ట్రూజర్స్, డెనిమ్స్.. ఇలా విభాగాల వారీగా కొత్త డిజైన్లు ఈ యాప్‌లో ఉంటాయి. వారంలోగా రిటైలర్లు ఆర్డరివ్వాలి. ఆర్డరిచ్చిన నెల రోజుల్లో సరుకు దుకాణాలకు చేరుతుంది. రెడీమేడ్ రంగంలో తొలిసారిగా ఈ కాన్సెప్ట్‌ను తాము అమలు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కస్టమర్లకే ప్రయోజనం.. సాధారణంగా రెడీమేడ్ రంగంలో ఆర్డరిచ్చిన 3–6 నెలలకు సరుకు దుకాణాలకు వస్తుంది. ఫాస్ట్ ఫ్యాషన్ కాన్సెప్ట్‌తో కస్టమర్లు నూతన డిజైన్లను ఎప్పటికప్పుడు ఆస్వాదించే వీలుంటుందని రాయల్ క్లాసిక్ మిల్స్ ఎండీ టి.ఆర్.శివరామ్ చెప్పారు. కంపెనీ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. దారం నుంచి దుస్తుల వరకు పూర్తి స్థాయి తయారీలో తాము ఉన్నాం కాబట్టి దీన్ని అమలు చేయటం సాధ్యమవుతోందని తెలియజేశారు. ‘‘సరుకు నిల్వ భయం ఉండదు. ఈ ఏడాది నవంబరు నుంచి ఈ కాన్సెప్ట్‌ను అమల్లోకి వస్తుంది’’ అని చెప్పారాయన. టర్నోవర్ రూ.800 కోట్లు.. తమిళనాడులోని తిరుపూర్ కేంద్రంగా 28 ఏళ్లుగా రాయల్ క్లాసిక్ మిల్స్ సేవలందిస్తోంది. 15 ఫ్యాక్టరీల్లో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. కంపెనీకి ఎగుమతుల ద్వారా 2017–18లో రూ.550 కోట్లు సమకూరింది. భారత్‌లో రిటైల్ ద్వారా మరో రూ.200 కోట్లు ఆర్జించింది. 10 శాతం ఆదాయం తెలంగాణ, ఏపీ నుంచి వస్తోంది. ప్రముఖ విదేశీ బ్రాండ్లకూ దుస్తులను తయారు చేసి ఎగుమతి చేస్తోంది. తయారీ కేంద్రాలకు రూ.250 కోట్లు వెచ్చించింది. 2018–19లో టర్నోవర్ రూ.800 కోట్లు ఉంటుందని శివరామ్ తెలియజేశారు. ఈ ఏడాది మరో 70 స్టోర్లు కంపెనీ క్లాసిక్ పోలోతోపాటు యువకుల కోసం ప్రత్యేకంగా సీపీ బ్రో బ్రాండ్‌లో రెడీమేడ్స్ తయారు చేస్తోంది. ఈ బ్రాండ్లు దేశవ్యాప్తంగా 3,000పైగా రిటైల్ దుకాణాల్లో లభిస్తున్నాయి. 130 ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్లున్నాయి. మార్చి కల్లా మరో 70 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు రానున్నట్లు శివరామ్ వెల్లడించారు. 2019–20లో కొత్తగా 100 ఔట్లెట్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. -
వృద్ధురాలి ఆత్మహత్య
అమరాపురం(మడకశిర) : అమరాపురం మండలం పి.శివరం గ్రామానికి చెందిన చెన్నబసమ్మ(80) శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటస్వామి ఆదివారం తెలిపారు. ఒంటరి జీవితం భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
తోటి విద్యార్థిని కొట్టి చంపేశాడు..
చెన్నై: తమిళనాడులో తిరుపూర్ నగరంలోని ఒక పాఠశాల లో ఆరేళ్ల బాలుడిని తోటి విద్యార్థి కొట్టి చంపాడు. స్థానికులను షాక్‌కు గురి చేసిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి అందించిన వివరాల ప్రకారం.... బుధవారం ఉదయం క్లాసులు ప్రారంభానికి ముందే స్కూలు ఆవరణలో ఒకటవ తరగతి విద్యార్థి శివరామ్, మరో విద్యార్థి(12 ) మధ్య ఘర్షణ జరిగింది. దీంతో చిన్నవాడైన శివరామ్‌ను తోటి విద్యార్థి కిందపడేసి దాడి చేశాడు. తీవ్రంగా కొట్టి గ్రౌండ్ నుంచి ఈడ్చుకుంటూ వెళ్లి భవనం వెనుక ఉన్న టాయిలెట్లో పడేశాడు. అక్కడితో ఆగిపోలేదు. శివరామ్ తలని అక్కడున్న పెద్ద రాయికేసి కొట్టి బాదాడు. రక్తమోడుతున్న ఆ బాలుడిని అలాగే వదిలేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో శివరామ్, అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీన్నిగమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయుడికి సమాచారం అందించారు. శివరామ్ ను తిరుపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ మొత్తం సంఘటనను 11 ఏళ్ల అమ్మాయి తరగతి కిటికీలో నుంచి చూడడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఆ బాలిక అందించిన సమాచారం ఆధారంగా పోలీస్ కమిషనర్ ఆధ్యర్వంలో పాఠశాలలో ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం హత్యకేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడిపై సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలను నమోదు చేసి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచారు. ఈ సంఘటన తరువాత పాఠశాలకు కొద్ది రోజులు సెలవులు ప్రకటించినట్టు సమాచారం. -
ఏకమైతే సీఎం కుర్చీ మనదే
సాక్షి, బళ్లారి: ఆరు కోట్ల మంది జనాభా కలిగిన కర్ణాటక రాష్ట్రానికి అస్పృశ్య జాతులకుచెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసేవరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చలవాది సంఘం వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరాం పేర్కొన్నారు. ఆయన మంగళవారం నగరంలోని బీడీఏఏ మైదానంలో జిల్లా స్థాయి దళిత ముఖ్యమంత్రి జనాందోళన క్రియా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్య తాను కూడా దళితుడేనని పేర్కొన్నారని, ఆయన సీఎం కుర్చీని వదిలేందుకు ఇష్టం లేక ఇలా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సరికొత్త డిక్లరేషన్ చేస్తున్నామని, అస్పృశ్య జాతులకు చెందిన వ్యక్తినే సీఎం కావాలని కోరుకుంటున్నామని, సీఎం సిద్ధరామయ్య అస్పృశ్య జాతులకు చెందిన వారైతే బహిరంగంగా చెప్పాలన్నారు. అంటరాని కులానికి చెందిన వారి బాధలు, అవమానాలు సిద్ధరామయ్యకు ఏమి తెలుసునని ప్రశ్నించారు. సీఎం సిద్ధరామయ్య ఒరిజినల్ కాంగ్రెస్‌వాది కాదన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వలస పక్షి అన్నారు. సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు చామరాజ నగర్ నుంచి పోటీ చేస్తే అక్కడ దళితులు ఏకమై సిద్ధరామయ్యను గెలిపించారన్నారు. అదే దళితుడు డాక్టర్ జి.పరమేశ్వర్ ముఖ్యమంత్రి అవుతారనే అసూయతో ఆయన్ను ఓడించారని నిప్పులు చెరిగారు. హైకమాండ్ జోక్యం చేసుకుని దళితులకు సీఎం స్థానం కట్టబెడితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందన్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కష్టం దళితులది, అధికారం సిద్ధరామయ్య అనుభవించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దళిత సంఘర్ష నేతలు మాట్లాడుతూ సీఎం కుర్చీ సిద్ధరామయ్య అబ్బ సొత్తు కాదని, ఆయన వెంటనే సీఎం కుర్చీ వ దలకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎన్.మూర్తి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ప్రధానమంత్రిని చేయడంలో కాని, పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను నియమించడంలో కానీ దళిత వ్యతిరేకిగా ముద్ర వేసుకుందని ఆయన పేర్కొన్నారు. బాబు జగ్జీవన్‌రాం ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పలు రాష్ట్రాల్లో దళితులు సీఎం కుర్చీలో కూర్చోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ సహకరించడం లేదన్నారు. కర్ణాటక రాష్ట్రంలో దళితుడు సీఎం కావాలని ఆరు కోట్ల మంది కన్నడిగులు కోరుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు చెవికెక్కడం లేదన్నారు. సీఎం సిద్ధరామయ్య తక్షణం ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోతే ఆయన్ను దళితులు ఎంతో గౌరవిస్తారన్నారు. దళితులంతా ఏకమై తమ సత్తా ఏమిటో చూపిద్దామని పిలుపునిచ్చారు. బళ్లారిలో ప్రారంభమైన ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోరాటం చేస్తామని, దళిత కులానికి చెందిన వారిని సీఎంగా కూర్చొబెట్టే వరకు నిద్రపోమన్నారు. మాల, మాదిగలు కలిసికట్టుగా ఉంటే కర్ణాటక రాష్ట్రంలో ఇతర కులాల వారికి సీఎం కుర్చీ దక్కే అవకాశం లేదన్నారు. దళితులను ఏకం చేస్తూ చలో బెంగళూరు, చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. దళిత సంఘర్షణ సమితి, చలవాది సంఘంతోపాటు దళిత కులానికి చెందిన పలు ఉపకులాల నేతలు పాల్గొన్నారు. -
కాలం చెల్లిన మందులు
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్ : సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు పంపిణీ చేస్తున్నారు. పట్టణానికి చెందిన సుధాకర్ గాయపడి ఇటీవలె ఏరియా ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు రాశారు. ఆస్పత్రి మందుల కౌంట ర్లో ప్రిస్కిప్షన్ చూపించి మూడు రకాల మందులు తీసుకున్నాడు. అందులో రెండు రకాల మందులు నాణ్యతగా ఉన్నాయి. కాగా విటమిన్ మాత్రలు కాలం చెల్లిపోయాయి. కవర్ తొలగించగానే మాత్ర పొడిగా మారింది. దుర్వాసన గుప్పుమంది. సర్కారు దవాఖానాలోనే ఇలాంటి మాత్రలు ఇస్తే ఎలాగని బాధితుడు వాపోతున్నాడు. ఎప్పటికప్పుడు మందులను, టానిక్‌లు, ఇంజక్షన్లను తనిఖీ చేసి కాలం చెల్లిన వాటిని పక్కకు పెట్టాల్సిన ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా ఉండటంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది రోగి సరిగా చూసుకోకుండా స్వీకరిస్తే అనారోగ్యం పాలు కావచ్చు, ఒక్కోసారి హరీ మనవచ్చు. అధికారు లు సిబ్బంది మందుల విషయంలో అప్రమత్తంగా ఉండాల ని ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం వివరణ కోరగా మందుల కౌంటర్లో తనిఖీలు నిర్వహిస్తామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.