
అప్పులు అధికమై..బతుకు భారమై
వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక.. కుటుంబాన్ని పోషించడం భారమై ఓ రైతు కుటుం బం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు
♦ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు కుటుంబం
♦ తోటవద్దకు వెళ్లి పురుగుల మందు తాగిన రైతు కుటుంబం
♦ పరిస్థితి విషమం పులివెందుల ఆసుపత్రికి తరలింపు
వేముల: వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక.. కుటుంబాన్ని పోషించడం భారమై ఓ రైతు కుటుం బం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు య త్నించిన సంఘటన శుక్రవారం వేముల మండ లం గొందిపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. ఆటోలో తోటవద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఎంత సేపటికి రాకపోవడంతో బంధువులు వెళ్లి చూడగా తోటవద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్నా రు. వెంటనే వారిన అక్కడే ఉన్న ఆటోలో పులి వెందుల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా పులి వెందుల సమీపంలోని రింగ్‌రోడ్డు వద్దకు రాగానే 108 వాహనం రావడంతో అందులో ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. గొందిపల్లె గ్రామానికి చెందిన చెల్లుబోయిన పుల్లయ్యకు 3.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పుల్లయ్యకు భార్య రమణమ్మ, కూతురు గంగాఅనూష, కుమారుడు ఉమాకాంత్ ఉన్నారు. వ్యవసాయంలో గిట్టుబాటు కాకపోవడంతో మైనింగ్ పనులకు కూడా వెళ్లేవాడు. అయితే ఈ ఆదాయంతో కుటుంబం నెట్టుకురావడం భా రంగా మారింది. ఒక పక్క వ్యవసాయానికి పెట్టుబడులు, పిల్లల చదువులకు ఆర్థికంగా భారమైంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో వ్యవసాయం చేసి ఆర్థిక సమస్యలనుంచి బయటపడాలనే ఉద్దేశంతో తన పొలంలో బోరు వేశాడు. నీరు పడకపోవడంతో మరో ఐదు బోర్లు వేశాడు. బోర్లకోసం రూ.8లక్షలు అప్పు చేశాడు. బోర్లలో నీరులేక పోవడంతో వర్షాధారం కిందనే పంటలు సాగుచేశాడు. అయితే పంటలలో దిగుబడులు రాక పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాక అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు.
అప్పులు పెరిగిపోతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బోర్లకు చేసిన అప్పులు తీర్చలేనని భావించి శుక్రవారం భార్య పిల్లలను ఆటోలో తీసుకొని తోటవద్దకు వెళ్లాడు అక్కడ వెంట తీసుకెళ్లిన పురుగుల మందును భార్య, పిల్లలకు తాగించి, ఆ తరువాత తాను తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు వీరికి పులివెందుల ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుల్లయ్య సోదరుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఫోన్‌లో ఆరా తీసిన వైఎస్ అవినాష్
రైతు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన విష యం తెలిసిన వెంటనే కడపలో ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బాధితుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
గొందిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య కుటుం బం ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిన వెంటనే. వైఎస్‌ఆర్ సీపీ మండల నాయకులు నా గేళ్ల సాంబశివారెడ్డి, జె డ్పీటీసీ సభ్యుడు మరకా శి వకృష్ణారెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి పరామర్శించా రు. వీరి కుటుంబ సభ్యులను ఓదార్చారు.