
తిరువొత్తియూరు(తమిళనాడు): కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోడ్ జిల్లా కొడుముడి, కోనావల్లి సమీపంలోని వీరవన్నై కాటూరుకు చెందిన ప్రభుశంకర్ (36). రైతు. భార్య శశికళ (33). వీరికి కుమారుడు నిఖిన్‌శంకర్ (12), కుమార్తె సుదర్శన (10) ఉన్నారు. సోమవారం రాత్రి భార్య, భర్త మధ్య గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో శశికళ, కుమారుడు, కుమార్తె విష మాత్రలు తిని స్పృహతప్పి పడిపోయారు. వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముగ్గురూ అదే రోజు మృతి చెందారు. దీనిపై మలయం పాళయం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment