
సాక్షి, గుంటూరు(తెనాలి): ప్రియుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని నందులపేటకు చెందిన పిన్నెల్లి గాయత్రి (32)కు వివాహమై భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఐతానగర్‌కు చెందిన డ్రైవర్ అంగలకుర్తి పవన్‌తో పరిచయమైంది. పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
పవన్‌కు గాయత్రి శుక్రవారం రాత్రి పదేపదే ఫోన్ చేసినా సమాధానమివ్వలేదు. దీంతో శనివారం మధ్యాహ్నం అతని ఇంటికి వెళ్లిన ఆమె ఘర్షణ పడింది. ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని చీరతో ఉరి వేసుకుంది. గది వెనుక వైపు ఉన్న తలుపులను పగులగొట్టి గాయత్రిని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా మృతి చెందినట్టు తెలపడంతో జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆమె కటుంబ సభ్యులు తిరుపతిలో ఉండటంతో పోలీసులు వారికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇక్కడకు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని టూటౌన్ పోలీసులు తెలిపారు.
చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment