సాక్షి, హన్మకొండ: హన్మకొండ లో వరకట్న వేధింపులకు బ్యాంకు ఉద్యోగిని బలైంది. భీమారం బ్యాంకు కాలనీలో నివాసం ఉండే గర్భిణిగా ఉన్న బ్యాంక్ ఉద్యోగిని ఆనూష అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. మృతదేహాన్ని హడావిడిగా ఆస్పత్రికి తరలించడంతో అనూష మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే.. హన్మకొండలోని భీమారం బ్యాంక్ కాలనీ లో నివాసం ఉండే అనుషా ప్రవీణ్ దంపతులిద్దరు బ్యాంక్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు.
2019లో వీరిద్దరికి వివాహం కాగా ఓ బాబు ఉన్నాడు. ఏమైందో ఏమో కానీ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆందోళనకు దారితీసింది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఆమె భర్త ప్రవీణ్ సమాచారం ఇచ్చి హడావిడిగా పుట్టింటివారు కూడా రాకముందే అనూష మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ గా ఉన్న అనూష కుటుంబ కలహాల గురించి ఇటీవలే తమతో మాట్లాడిందని పుట్టింటివారు తెలిపారు. అనూష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, భర్తే ఉరేసి చంపి ఆత్మహత్యగా నాటకం ఆడుతున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
పెళ్లి సమయంలో 20 లక్షల కట్నం, కారు, బైక్ ఇచ్చామని, భూమి కావాలంటే 20 గుంటల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అదనపు కట్నం కోసమే వేధించి భర్త హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూష మృతదేహం పక్కనే భర్త మృతదేహం ఉండాలని అతని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment