ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,జైనథ్(అదిలాబాద్): మండల కేంద్రంలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన కావటి మమతకు పదేళ్ల క్రితం జైనథ్‌కు చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి 8 ఏళ్ల వయస్సు గల విష్ణువర్ధన్, 6 నెలల బాబు ఉన్నారు. శుక్రవారం ఉద యం 6 గంటలకు మమత నిద్రలేచి భర్తకు చాయ్ ఇచ్చింది. ఆ తర్వాత రాజు పశువులకు మేత పెట్టేందుకు ఇంటి పక్కనే ఉన్న పశువుల పాకకు వెళ్లాడు. కుమారుడు విష్ణువర్ధన్ నిద్రలేచి తల్లికోసం రోదిస్తూ వెతకగా స్టోర్‌రూమ్‌లో ఉరేసుకుని కనిపించింది.
మమత బంధువుల ఆందోళన
మమత మృతి విషయం తెలుసుకున్న మహారాష్ట్రలోని కుటుంబ సభ్యులు, బంధువులు జైనథ్ చేరుకున్నారు. మమత ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, ఇంకేమైన జరిగి ఉంటుందా, ఆరు నెలల బాబును వదిలేసి ఆత్మహత్య చేసుకో వాల్సిన దుస్థితి ఏముంటుందని కన్నీరుమున్నీరయ్యారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు రిమ్స్‌కు తరలిస్తుండగా బంధువులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు రిమ్స్‌కు తరలించారు. రిమ్స్ ఎదుట కూడా కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మృతురాలి ఇద్దరి కుమారుల పేరిట 2.7 ఎకరాల భూమి రాసివ్వాలని డిమాండ్ చేశారు. మృతురాలి భర్త రాజు కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. సా యంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెర్సిస్ బిట్ల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment