ప్రేమ వివాహం.. నాలుగేళ్ల క్రితం విడాకులు.. అప్పటి నుంచి.. | Married Woman Suicide Train Mancherial | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం.. నాలుగేళ్ల క్రితం విడాకులు.. అప్పటి నుంచి..

Feb 27 2022 7:47 AM | Updated on Feb 27 2022 8:17 AM

Married Woman Suicide Train Mancherial - Sakshi

భారతి (ఫైల్‌)

సాక్షి,తాండూర్‌: మండల కేంద్రమైన తాండూర్‌లోని కొత్త గుడిసెల ఏరియాకు చెందిన మంచి కట్ల భారతి(33) శని వారం ఆత్మహత్య చేసుకుంది. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతికి పన్నెండేళ్ల క్రితం ఐబీకి చెందిన మేడి వినయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్ల క్రి తంవిడాకులు తీసుకుంది. అప్పటి నుంచి మతిస్థిమితం లేక ఇంట్లోనే ఉంటోంది. శనివారం ఉదయం రేచి నీ రోడ్‌ రైల్వేస్టేషన్‌ శివారు ప్రాంతా నికి వచ్చి భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబు ల్‌ సంపత్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో..

గుర్తు తెలియని వ్యక్తి మృతి 
సిర్పూర్‌(టి): మండలంలోని వేంపల్లి గ్రామ సమీపంలోని రైల్వేగేటు సమీపంలో శనివారం ఉద యం గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతిచెందినట్లు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ సురేష్‌గౌడ్‌ తెలి పారు. మంచిర్యాల వైపు నుంచి బల్లార్షా వైపునకు వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి చనిపోయాడని, 55 నుంచి 60ఏళ్ల వయస్సు ఉంటుందని పేర్కొన్నారు. నల్లని చుక్కలు గల తెలుపు రంగు షర్టు, సిమెంటు కలర్‌ ప్యాంటు ధరించి ఉన్నాడని, మృతదేహం సమీపంలో ముస్లిం టోపి ఉందని తెలి పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి వివరాలు తెలిసిన వారు పట్టణంలోని జీఆర్‌పీ పోలీసుస్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు. మృతదేహం సిర్పూర్‌(టి) ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో భద్రపర్చామని వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement