గణేశ్(ఫైల్)
మంచిర్యాలక్రైం : భార్య, అత్తమామ, బావమరుదులు కొట్టారని మనస్తాపంతో శ్రీరాంపూర్‌కు చెందిన అల్లే గణేశ్‌కుమార్(32) మంగళవారం రాత్రి మంచిర్యాల రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీరాంపూర్‌కు చెందిన వార సంత బట్టల వ్యాపారి గణేశ్‌తో నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు సుమనోహర్, రెండు నెలల కూతురు ఉంది. గణేశ్, మౌనిక మధ్య ఏడాదిగా కుటుంబ తగాదాలు జరుగుతన్నాయి. మౌనిక గర్భం దాల్చిన తర్వాత 10 నెలల క్రితం గణేశ్ కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్లి పోయింది.
ఈ క్రమంలో మౌనిక ఓ కూతురికి జన్మనిచ్చింది. కన్న కూతురును చూసేందుకు వెళ్లిన గణేశ్‌ను నెల రోజుల క్రితం చూపించకుండానే అవమాన పరిచి పంపించినట్లు గణేశ్ కుటుంబీకులు తెలిపారు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ సైతం నిర్వహించారు. అయినా మౌనికలో మార్పు రాలేదని కుటుంబీకులు నాలుగు రోజుల క్రితం, కూతురును చూపించాలని వెళ్లిన గణేశ్‌ను ఆత్తమ్మ రాజమని, మామ రాంచంధర్, బావమరిది శ్రీధర్, భార్య మౌనిక సైతం కొట్టి పంపించినట్లు గణేశ్ కుటుంబీకులు ఆరోపించారు. అవమానం భరించలేకనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన గణేశ్ రైలు పట్టాలపై గురువారం ఉదయం శవమై కనిపించాడాని విలపించారు. గణేశ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే జీఆర్పీ ఎస్సై జితేందర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment