
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వెంటపడుతున్న యువకుడి వేధింపులు తట్టుకోలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులను ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
వివరాలు.. మంచిర్యాల జిల్లా దండపేల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎంబడి సాయిష్మ అనే యువతిని అదే గ్రామానికి చెందిన నలిమేల వినయ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని తరుచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు ఇప్పటికే నిశ్చితార్థం జరిగిందని, వేధించవద్దని సాయిష్మ కోరినా.. యువకుడు పట్టించుకోలేదు. అంతేగాక తనను పెళ్లి చేసుకోకపోతే నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఈ క్రమంలో ఈనెల 18న యువతికి ఫోన్‌చేసి నువ్వు చచ్చిపో, బతికి ఉండకంటూ బెదిరించాడు. దీంతో మనస్తాపానికి గురైన సాయిష్మ.. వినయ్ వేధింపులు తట్టుకోలేక శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లిదండ్రులు వెంటనే చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకువచ్చారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయిష్మా మృతి చెందింది. దీంతో వినయ్ కుమార్ వల్లే తమ కూతురు చనిపోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment