సత్యశ్రీ(ఫైల్), జాడి రవి(ఫైల్)
‘మనసులు ఏకమయ్యాయి.. కలకాలం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం... నాకు నువ్వు, నీకు నేను తోడుగా కొత్త జీవితం ప్రారంభిద్దామనుకున్నాం.. నీ ఊపిరే నేనని.. నా ఊపిరే నీవని ఊహలపల్లకిలో తేలిపోయాం.. కానీ నీ అకాల మరణం నన్ను ఒంటరిని చేసింది.. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. నీవులేని జీవిత శూన్యం.. నీవెంటే నేను వస్తున్నా..’ అంటూ ప్రియురాలి ఎడబాటును జీర్ణించుకోలేని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెలలో చోటుచేసుకుంది
నెన్నెల ఎస్సై సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి చెందిన జాడి రవి(18) ఈనెల 2న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన దుర్గం సత్యశ్రీ , రవి ఏడాదిగా ప్రేమించుకున్నారు. సత్యశ్రీ అనారోగ్యంతో ఈనెల 2న మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న రవి ప్రియురాలు లేని జీవితం వ్యర్థమని గ్రామ శివారుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. బంధువులు వెంటనే అతడిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. రవి సోదరుడు జాడి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు..
Comments
Please login to add a commentAdd a comment