![heart attack on married woman at warangal - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/19/heart-attack.jpg.webp?itok=426nqeu8)
నెల్లికుదురు: జపాన్ నుంచి వచ్చిన వారం రోజులకే గుండెపోటుకు గురై ఓ వివాహిత మృతి చెందిన సంఘటన మండలంలోని చిన్నముప్పారంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కదిర రాకేష్–సృజన (32) దంపతులు గత కొన్నేళ్లుగా జపాన్‌లో ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడ్డారు.
ఈ క్రమంలో సృజనకు కొన్ని నెలలుగా ఆరోగ్యం సహకరించడం లేదన్నారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వారం రోజుల క్రితం జపాన్ నుంచి వచ్చి వరంగల్‌లో తన బంధువుల ద్వారా రోహిణి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి 5 ఏళ్ల కూతురు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment