
రోజా (ఫైల్)
గంగవరం(చిత్తూరుజిల్లా): మండలంలోని కల్లుపల్లె పంచాయతీ మల్లేరులో ఆదివారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. గొంతుకోసి హతమార్చడంపై స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. వివరాలు.. గ్రామానికి చెందిన యాదగిరి, రోజాకు సుమారు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు లేరు. ఈ క్రమంలో రోజా ఒంటరిగా ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు నగలకోసం హత్య చేశారని భర్త యాదగిరి గ్రామస్తులకు తెలిపాడు.
చదవండి: హనీట్రాప్ వెనుక ఇదీ కుట్ర!.. ఇంజనీరింగ్ విద్యార్థినితో కథ అమలు
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డీఎస్పీ గంగయ్య, సీఐ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు డాగ్‌స్కాడ్‌ను రప్పించి దర్యాప్తు ప్రారంభించారు. అయినప్పటికీ పోలీసులకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఇంతలో మృతురాలి కుటుంబీకులు అక్కడకు చేరుకుని తమ బిడ్డను యాదిగిరే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు.
అతనిపై దాడికి యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. డీఎస్పీ మాట్లాడుతూ హత్య జరిగిన తీరుపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. పకడ్బందీగా దర్యాప్తు చేసి అసలు నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది సమక్షంలో మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment