బోరబండలో భారీ శబ్దాలు | People Afraid Of Huge Sounds Came From Borabanda In Hyderabad | Sakshi
Sakshi News home page

బోరబండలో భారీ శబ్దాలు

Published Fri, Oct 2 2020 9:51 PM | Last Updated on Fri, Oct 2 2020 10:31 PM

People Afraid Of Huge Sounds Came From Borabanda In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బోరబండలోని వీకర్స్‌ కాలనీ సైట్‌ 3 నుంచి శుక్రవారం రాత్రి భారీ శబ్ధాలు వినిపించాయి. దాదాపు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయకంపితులయ్యారు. అయితే భూకంపం వచ్చిందేమోనని భయపడి స్థానికులు ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున బయటికి వచ్చారు. అది భూకంపమా లేక భారీ శబ్దాలా అనేది తెలియాల్సి ఉంది. 2017లోనూ ఇదే తరహాలో భారీ శబ్దాలు వచ్చినట్లు బోరబండ వాసులు పేర్కొన్నారు. కాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తన టీంతో కలిసి భారీ శబ్దాలు వినిపించిన సైట్‌-3 ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement