హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు | Mild earthquake hits Hyderabad | Sakshi

హైదరాబాద్‌లో స్వల్ప భూ ప్రకంపనలు

Oct 21 2017 1:21 PM | Updated on Sep 4 2018 5:07 PM

Mild earthquake hits Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే రూట్‌లో ఉన్న ప్రాంతాలు స్వల్పంగా కంపించాయి. రహ్మత్‌నగర్ డివిజన్‌లోని హెచ్‌ఎఫ్ నగర్, ఇందిరా నగర్, ప్రతిభా నగర్ ప్రాంతాల్లో ఉదయం 3 నుంచి 3.30 గంటల ప్రాంతంలో భూమి స‍్వల‍్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. భూప్రకంపనల వల్ల ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. భూమి కంపించిన ప్రాంతాల్లో ఉదయం ఎమ్మార్వో సైదులు, కార్పొరేటర్ షఫీ పర్యటించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement