
బోరబండలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ బోరబండ పరిధిలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకోవడంతో సుమారు రూ.80 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్‌లో వేసే 12 డ్రమ్ముల కేబుల్ కాలిపోయినట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.