బోరబండలో దారుణం
Published Wed, May 10 2017 12:05 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
హైదరాబాద్: నగరంలోని బోరబండలో దారుణం వెలుగుచూసింది. తాతయ్యతో కలిసి నిద్రిస్తున్న ఓ పదేళ్ల బాలుడిపై గుర్తుతెలియని దుండగులు కాగడాలు విసిరారు. ఈ ఘటనలో బాలుడితో పాటు తాతయ్య యాదయ్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు అదపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Advertisement
Advertisement