ఆదివారం తెల్లవారుజామున నగరం మరోసారి ఉలిక్కిపడింది. సిటీలోని బోరబండ, రహ్మత్ నగర్‌లతో పాటు, పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు.