పాప ఏడుస్తోంది.. పాలు కావాలి  | KTR Sends Milk To Erragadda For Baby Girl | Sakshi
Sakshi News home page

పాప ఏడుస్తోంది.. పాలు కావాలి 

Published Sat, Apr 18 2020 1:15 AM | Last Updated on Sat, Apr 18 2020 1:15 AM

KTR Sends Milk To Erragadda For Baby Girl - Sakshi

పాప తండ్రితో మాట్లాడుతున్న డిప్యూటీ మేయర్‌ బాబా

వెంగళరావునగర్‌: తల్లిలేని 5 నెలల పాపకు పాలులేవంటూ రాష్ట్రమంత్రి కేటీఆర్‌కు ఓ వ్యక్తి ట్వీట్‌ చేయడంతో మంత్రి స్పందించి డిప్యూటీ మేయర్‌ ద్వారా సాయం అందించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్‌ ప్రేమ్‌నగర్‌లో లకాన్‌సింగ్, జ్యోతిలు దినసరి కూలీలు . వారికి 5 నెలల పాప ఉంది. అనారోగ్య కారణాలతో నెలరోజుల కిందట పాప తల్లి జ్యోతి మృతి చెందింది. దాంతో తండ్రి లకాన్‌సింగ్‌ పాపకు తానే ప్యాకెట్‌ పాలు పట్టిస్తూ ఉన్నాడు. లాక్‌డౌన్‌ కారణాల వల్ల ఆ పాపకు గురువారం తండ్రి పాల ప్యాకెట్‌ తీసుకురాలేకపోయాడు.

పాలులేక ఆ రాత్రి పాప ఏడుస్తుంటే ఈ విషయాన్ని వారి ఇంటి పక్కనే ఉంటున్న నవీన్‌ అనే యువకుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. దానికి మంత్రి కేటీఆర్‌ అప్పటికప్పుడు స్పందిస్తూ సమీపంలో బోరబండ వద్ద నివసిస్తున్న డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌కు తెలియజేసి పాపకు పాలను చేరేలా చూడాలని కోరారు. కేటీఆర్‌ సూచన మేరకు గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమ యంలో డిప్యూటీ మేయర్‌ బాబా హుటాహుటిన ఎర్రగడ్డకు పాలు తీసుకుని వెళ్లి పాప తండ్రికి అందించడంతో పాటుగా ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యా వసర సరుకులు అందించారు. తమ కుటుంబానికి సాయం అందించడంతో పాటుగా పాపకు పాలు సకాలంలో అందించిన కేటీఆర్‌కు, డిప్యూటీ మేయర్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం విషయం తెలుసుకుని మంత్రి కేటీఆర్‌ డిప్యూటీ మేయర్‌ను అభినందించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement