
సాక్షి, విజయవాడ: నగరంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఘటన మూలాలపై ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. నిందితులను స్పాట్‌కు తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. కేసును కొలిక్కి తెచ్చేందుకు ఆరు ప్రత్యేక బృందాలు శ్రమిస్తున్నాయి. కేసు దర్యాప్తు అత్యంత గోప్యంగా సాగుతోంది. ఇప్పటికే సందీప్, పండు గ్యాంగ్‌లకు చెందిన 24 మందిని అరెస్ట్ చేయగా.. మిగిలిన స్ట్రీట్ ఫైటర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. (యువతి కోసం గుంటూరులో గ్యాంగ్ వార్)
గుంటూరు ఆసుపత్రి నుంచి పండు డిశ్చార్జ్ కాగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. బెజవాడ రౌడీషీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రౌడీ దర్బార్ ల ద్వారా నేరగాళ్లలో పరివర్తనకు ప్రయత్నాలు చేస్తున్నారు. తీరు మార్చుకోకుంటే నగర బహిష్కరణ తప్పదని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఎవరైనా ఆయుధాలతో కనిపిస్తే 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. (‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’)
Comments
Please login to add a commentAdd a comment