
గుంటూరులో మళ్లీ గ్యాంగ్ వార్
గుంటూరు: గుంటూరులో మరోసారి గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. రౌడీషీటర్ నల్లపాటి శివయ్య అనుచరుల మధ్య ఆధిత్యపోరులో ముగ్గురు హతమయ్యారు. శనివారం రాత్రి ఈ హత్యలు వెలుగు చూశాయి. మృతులు కామేపల్లి రాము(25), ఉలవనీటి రవిరాజ్(30), రాజేశ్ గా గుర్తించారు.
బాలకోటేశ్వరరావు వర్గం వీరిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాలకోటేశ్వరరావు వర్గానికి చెందిన ఆరుగురు ఆదివారం తెల్లవారుజామున పోలీసుల ఎదుట లొంగిపోయారు. గ్యాంగ్ వార్ హత్యలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.