మంగళగిరిలో గ్యాంగ్ వార్ : ఇద్దరు హతం
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో రెండు గ్రూపుల మధ్య జరిగిన దాడుల్లో ఇద్దరు గ్రూపు నాయకులు దారుణ హత్యకు గురయ్యారు. నిడమూరు రోడ్డులో రైల్వే గేటు సమీపంలో గురువారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
హేమంత్, రమేష్ అనే రెండు వర్గాలకు చెందిన గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చింటూ అనే వ్యక్తి వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి రాత్రి విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో ఒకరిపై మరోకరు దాడి చేసుకున్నారు. తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారు మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చింటూ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.