
సాక్షి, విజయవాడ: నగరంలో ఇటీవల సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ మూలాలపై పోలీసులు ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. స్టీట్‌ఫైట్‌లో పాల్గొన్న వారి నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లతో పాటు, మరో పదమూడు మందిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సందీప్ గ్యాంగ్ వాడిన ఆయుధాలు స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సందీప్ గ్యాంగ్ వివరాలను సీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు వెల్లడించనున్నారు. (ఇప్పుడు దృష్టంతా కాల్‌డేటా పైనే!)
పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వివాదానికి కారణమైన ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డీల్ కుదిర్చిన నాగబాబులను పోలీసులు విచారిస్తున్నారు. గ్యాంగ్‌వార్ ఘటనకు సంబంధించి కాల్‌డేటా ఆధారంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. (గ్యాంగ్‌వార్ కేసు కొలిక్కి!)
Comments
Please login to add a commentAdd a comment