ఢిల్లీలో కాల్పుల కలకలం | 3 dead, one constable injured in Mianwali gang war in delhiead, one constable injured in Mianwali gang war in delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కాల్పుల కలకలం

Published Mon, May 1 2017 9:45 AM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

ఢిల్లీలో కాల్పుల కలకలం

ఢిల్లీలో కాల్పుల కలకలం

ఢిల్లీ: దేశరాజధానిలో కాల్పులు కలకలం రేపాయి. ఓ గ్యాంగ్‌స్టర్‌ను లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

మియన్‌వాలి ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న భూపేంద్ర అనే గ్యాంగ్‌స్టర్‌.. మిత్రుడు అరుణ్‌, పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ విజయ్‌తో కలిసి కారులో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుల్దీప్‌ అనే మరో కానిస్టేబుల్‌ సైతం ఈ ఘటనలో గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement