గ్యాంగ్‌వార్‌: వారిపై నగర బహిష్కరణ వేటు | City deportation Those Involved In Gang War | Sakshi
Sakshi News home page

‘గ్యాంగ్‌’పై బహిష్కరణ వేటు 

Published Tue, Jun 9 2020 10:27 AM | Last Updated on Tue, Jun 9 2020 2:44 PM

City deportation Those Involved In Gang War - Sakshi

సాక్షి, అమరావతి: బెజవాడ్‌ గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న కొందరిపై నగర బహిష్కరణ వేటు పడనుంది. అలాగే గ్యాంగ్‌వార్‌కు కారకులైన మాజీ రౌడీïÙటర్‌ సందీప్, మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు గ్రూపులకు చెందిన సభ్యులందరిపైనా పీడీ యాక్ట్‌ పెట్టనున్నారు. ఘర్షణ జరిగిన రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 10 మంది నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కన్నబిడ్డను నేరాలవైపు ప్రోత్సహించిన కారణంగా పండు తల్లి కోడూరి పద్మావతిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి రౌడీïÙట్‌ ఓపెన్‌ చేశారు.   

గ్యాంగ్‌వార్‌పై పోలీసుల కఠిన చర్యలు..  
విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌ను తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఇరు గ్రూపులకు చెందిన సభ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో కొందరు రౌడీ మూకలు యువకులతో కలిసి అలజడి రేపడాన్ని క్షమించరాని నేరంగా భావించి గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న కొందరు యువకులపై నగర బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. అలాగే నిందితులందరిపైనా పీడీ యాక్ట్‌ను ఉపయోగించబోతున్నారు.  
విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 417 మంది రౌడీషీటర్లు ఉన్నారు.  
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరగాళ్లు 497 మంది ఉన్నారు.
ఇప్పటికే 7 మందిపై నగర బహిష్కరణ వేటు వేయడం జరిగింది.  
తాజాగా సందీప్, పండుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్‌ నేపథ్యంలో మరికొందరిపై నగర బహిష్కరణ వేటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు.  చదవండి: యువతి కోసం గుంటూరులో గ్యాంగ్‌ వార్

పండు తల్లిపై రౌడీషీట్‌.. 
మాజీ రౌడీషీటర్‌ సందీప్‌పై మణికంఠ అలియాస్‌ పండును దాడికి ప్రోత్సహించిన కారణంగా అతని తల్లి కోడూరి పద్మావతిని సందీప్‌ హత్యా నేరం కేసులో నాల్గో ముద్దాయిగా చేరుస్తూ పటమట పోలీసులు కేసు నమోదు చేసి.. రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. గతంలో పద్మావతిపై పెనమలూరు పరిధిలో రెండు కేసులు ఉన్నాయి. ఇప్పుడు పటమట 307 ఐపీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు అయింది.

మొత్తం మూడు కేసులు నమోదు కావడంతో ఈమెపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయనున్నారు. దీంతో పెనమలూరు పోలీసుస్టేషన్‌ పరిధిలోనే కాకుండా నగరంలోనే మొట్టమొదటి మహిళ రౌడీషీటర్‌గా ఈమె పోలీసు రికార్డుల్లోకెక్కనుంది. అలాగే పీడీ యాక్ట్‌ కూడా పద్మావతిపై పోలీసులు పెట్టనున్నారు. దీంతోపాటు పద్మావతి గత చరిత్ర, ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆమెకు నేరప్రవృత్తి ఉన్నట్లు రుజువైతే నగర బహిష్కరణ వేటు వేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.  చదవండి: బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. సీన్ రీకన్‌స్ట్రక్షన్

కొనసాగుతున్న జల్లెడ.. 
ఇక ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 10 మంది నిందితులతోపాటు సెటిల్‌మెంట్ల వ్యవహారంలో తలదూర్చిన మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అజ్ఞాతంలో ఉన్నవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.   

సందీప్‌ గ్యాంగ్‌ సభ్యుల అరెస్ట్‌
అమరావతి: మాజీ రౌడీషీటర్‌ తోట సందీప్‌ గ్యాంగ్‌ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పదకొండు రోజుల కిందట విజయవాడలోని పటమట తోటవారివీధిని మైదానంలో రెండు గ్రూపులు మారణాయుధాలతో దాడి చేసుకున్న సంగతి విదితమే. ఈ గ్యాంగ్‌వార్‌లో తీవ్రంగా గాయపడ్డ తోట సందీప్‌ మృతి చెందగా.. మరో గ్రూపునకు లీడర్‌గా ఉన్న కోడూరి మణికంఠ అలియాస్‌ పండు గాయాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పండు వర్గంపై దాడికి పాల్పడ్డ తోట సందీప్‌ వర్గానికి చెందిన 11 మందిని పటమట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ హర్షవర్థన్‌రాజు ఆ వివరాలను వెల్లడించారు.  

గ్యాంగ్‌వార్‌లో సందీప్‌ తరఫు పాల్గొన్న 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ చెప్పారు. 
వారి నుంచి రెండు పట్టా కత్తులు, ఒక నేపాల్‌ కత్తి, రెండు రాడ్లు, కర్ర, బేడ్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు.  
నిందితుల్లో సందీప్‌ సోదరుడు తోట జగదీష్‌ అలియాస్‌ బాలు, మంగళగిరికి చెందిన మేకతోటి కిరణ్‌కుమార్, ఆకురాతి వెంకట శివరఘునాథ్, పంది విజయప్రసాద్‌లు ఉన్నారు. వీరిలో కిరణ్, రఘునాథ్‌లపై మంగళగిరి పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్లు ఉన్నాయి.  
వీరితోపాటు యర్రంశెట్టి రాము, చింతా సాంబశివరావు, చందా రామ్‌ నితిన్, జక్కా రత్నసాయిలు, పెనమలూరుకు చెందిన కందెల శివరామకృష్ణ, యనమలకుదురుకు చెందిన బోడా శివ, తాడిగడపకు చెందిన కన్నా సునీల్‌లు ఉన్నారన్నారు.  

చిన్ననాటి స్నేహితులు.. 
వీరిలో చాలా మంది సందీప్‌కు చిన్ననాటి స్నేహితులు కావడం, ఒకే స్కూల్‌లో చదువుకోవడం వల్ల ఆ పరిచయంతో పిలవగానే వీరంతా సందీప్‌ వెంట వచ్చారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నవారందరిపైనా వేట కొనసాగుతోందన్నారు. సెంట్రల్‌ ఏసీపీ నాగరాజురెడ్డి, పటమట, పెనమలూరు సీఐలు సురేష్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement