అచ్చంపేట: మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలం హఫీజ్‌పూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బోలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బోలెరోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు, బొలేరో ఢీ.. ముగ్గురు మృతి
Published Mon, Dec 26 2016 9:50 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement