ఐఎఎస్ అధికారి అనుమానాస్పద మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో అనుమానాస్పద స్థితిలో ఐఏఎస్ అధికారి మృతిచెందారు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన కర్నాటక కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి అనురాగ్ తివారి (35) బుధవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కలకలం రేపింది. 2007 బ్యాచ్‌కు చెందిన అనురాగ్ తివారీ కర్ణాటక ఫుడ్, పౌర సరఫరా మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.
ఉత్తర ప్రదేశ్ కుచెందిన తివారి లక్నో యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే గత రెండు రోజులుగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని మీరాబాయి మార్గంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్నారు.మార్నింగ్ వాక్‌కు వెళ్లిన తివారీ కుప్పకూలిపోయినట్టు పోలీసులు అందించిన సమాచారం. గడ్డం మీద ఒక చిన్న కట్ తప్ప పెద్ద గాయాలు లేవని పోలీసు అధికారి ఏకే షాహి తెలిపారు. కానీ, రోడ్డు మీద కొంత రక్తం కనిపించిందన్నారు. దర్యాప్తుకొనసాగుతోందని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్టు తరువాత మాత్రమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని చెప్పారు.
కాగా అయిన తివారి ఇటీవల విడాకులు తీసుకున్నారు. బిదార్ డిప్యూటీ కమిషనర్‌గా, మధుగిరి సహాయక కమిషనర్గా, కొడగు డిప్యూటీ కమీషనర్ గా, బెంగళూరు డిప్యూటీ సెక్రెటరీ (ఫైనాన్స్) పనిచేశారు.