విజయవాడ టౌన్: నిత్యం రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్‌లో రైల్వే విచారణ కేంద్రం వద్ద అరవై సంవత్సరాల వృద్ధుడు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించాడు. బుధవారం ఉదయం 7 గంటల వరకు అతనిని ఎవరూ పట్టించుకోలేదు. ప్రయాణికులు దాటుకుని వెళ్తున్నారే తప్ప అతని గురించి కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదు.
చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది.