
టీవీ నటుడి అనుమానాస్పద మృతి
కోలకతా: బెంగాల్ లో ప్రముఖ టీవీ నటుడు రోనెన్ చక్రవర్తి అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. తన ఇంటికి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ లో ఆయన శవమై కనిపించారు. దీంతో బెంగాలీ టీవీ పరిశ్రమ షాక్ కు గురైంది. శుక్రవారం అర్ధరాత్రి తరువాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో స్నేహితులతో కలిసి స్విమ్మింగ్కు వెళ్లి గల్లంతయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
వారి ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు రోనీ మృతదేహాన్ని కనుగొన్నామని పోలీసు అధికారులు తెలిపారు. వెంటనే అతడ్ని స్థానిక ఎంఆర్ ఆసుపత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు.
కాగా టీవీ యాంకర్ గా కెరరీ మొదలుపెట్టిన రోనెన్ బెంగాలీ బుల్లి తెరకు రోనీగా పరిచయమైన ప్రస్తుతం జోల్ నూపుర్ అనే ఒక మెగా సీరియల్లో నటిస్తున్నట్టు సమాచారం.