న్యూయార్క్: అమెరికాలో ఆచూకీ తెలియకుండా పోయిన భారత సంతతి విద్యార్థిని మరణించింది. న్యూయార్క్లో నివసిస్తున్న 22 ఏళ్ల జాస్మిన్ జోసెఫ్ ఫిబ్రవరి నుంచి కనిపించకుండా పోయింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు మంగళవారం గుర్తించారు. ఓ షాపింగ్ సెంటర్లో పార్కింగ్ చేసిన కారులో విగతజీవిగా ఉన్న జోసెఫ్ శరీరాన్ని కనుగొన్నారు.
ఫిబ్రవరి 24న ఆమె చివరి సారి ఇంటి నుంచి వెళ్లింది. న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్కు కారులో బయల్దేరింది. అదే రోజు సాయంత్రం కాలేజీ లైబ్రేరీలో ఉన్నట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ఆమె జాడ కనిపించలేదు. కాగా గతేడాది నుంచి ఆమె కాలేజీకి రావడం లేదని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుత సెమిస్టార్లో ఆమె పేరు లేదని చెప్పారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదని, వ్యక్తిగత కారణాలతోనే జోసెఫ్ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పారు.
అమెరికాలో భారత సంతతి విద్యార్థిని ఆత్మహత్య
Published Wed, Mar 12 2014 1:21 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement