అమెరికాలోని మైనేలో కాల్పులతో విధ్వంసం సృష్టించిన నిందితుడు శవమై తేలాడు. మైనేలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 16 మందిని పొట్టనపెట్టుకున్న నిందితుడు బౌడోయిన్‌కు చెందిన రాబర్ట్ కార్డ్ (40) తుపాకీతో తననుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా పోలీసులు, FBI ఏజెంట్లు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు.
కార్డ్ మృతదేహం లూయిస్టన్‌కు ఆగ్నేయంగా ఉన్న లిస్బన్ ఫాల్స్‌లో రీసైక్లింగ్ సెంటర్‌కు సమీపంలో గుర్తించామని మైనే పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అయిన కార్డ్ ఇంతకు ముందు పనిచేసిన చోట ఉద్యోగం కోల్పోయినట్టు తెలుస్తోందన్నారు. అతను మానసికసమస్యలకు చికిత్స పొందుతున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. అలాగే కార్డ్‌కు చెందిన తెల్ల ఎస్‌యూవీ కారును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
అటు ఈ ఘటనపై గవర్నర్ జానెట్ మిల్లిస్ మాట్లాడుతూ ఆ దుర్మార్గుడు మరణంతో చాలా ఇకపై ఎవరికి ముప్పు లేదని తెలిసి చాలా ఊరటగా ఉంది...కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని మిల్లిస్ ఒక వార్తా సమావేశంలో ప్రకటించారు.
కాగా బుధవారం (అక్టోబరు 25) రాత్రి మైనేలోని లెవిస్టన్‌లోని బౌలింగ్ అల్లే, రెస్టారెంట్‌లో రాబర్ట్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 16 మందిని చని పోయారు. వీరిలో 70 ఏళ్ల భార్యాభర్తలు, తండ్రితో పాటు హత్యకు గురైన 14 ఏళ్ల బాలుడి వరకు బాధితులను అధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ ఘటనలో మరో 50-60 మంది దాకా గాయ పడిన సంగతి తెలిసిందే.
2017లో లాస్ వెగాస్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో 60 మంది మరణించిన ఘటన, అలాగే 2022లో టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ముష్కరుడు కాల్పులు జరిపి, 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులను చంపిన ఘటన తరువాత ఇదే అత్యంత ఘోరమైన కాల్పులు కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
#WATCH | Maine, US: The Maine state police find the body of the suspect, Robert Card, in the shooting at multiple locations. At least 16 people were killed and 50-60 wounded in mass shootings in Lewiston, Maine in the US on Wednesday.
— ANI (@ANI) October 28, 2023
Department Of Public Safety Commissioner… https://t.co/6g3iEBeCL8 pic.twitter.com/X73QdSNBgy
Comments
Please login to add a commentAdd a comment