mass shootings
-
నరహంతకుడు చచ్చాడు..ఇపుడు ఊపిరి పీల్చుకుంటున్నా!
అమెరికాలోని మైనేలో కాల్పులతో విధ్వంసం సృష్టించిన నిందితుడు శవమై తేలాడు. మైనేలో రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో 16 మందిని పొట్టనపెట్టుకున్న నిందితుడు బౌడోయిన్కు చెందిన రాబర్ట్ కార్డ్ (40) తుపాకీతో తననుతాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా పోలీసులు, FBI ఏజెంట్లు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతని మృతదేహాన్ని గుర్తించారు. కార్డ్ మృతదేహం లూయిస్టన్కు ఆగ్నేయంగా ఉన్న లిస్బన్ ఫాల్స్‌లో రీసైక్లింగ్ సెంటర్‌కు సమీపంలో గుర్తించామని మైనే పబ్లిక్ సేఫ్టీ కమీషనర్ మైక్ సౌషుక్ తెలిపారు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ అయిన కార్డ్ ఇంతకు ముందు పనిచేసిన చోట ఉద్యోగం కోల్పోయినట్టు తెలుస్తోందన్నారు. అతను మానసికసమస్యలకు చికిత్స పొందుతున్నట్టు సమాచారం ఉందని తెలిపారు. అలాగే కార్డ్‌కు చెందిన తెల్ల ఎస్యూవీ కారును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అటు ఈ ఘటనపై గవర్నర్ జానెట్ మిల్లిస్ మాట్లాడుతూ ఆ దుర్మార్గుడు మరణంతో చాలా ఇకపై ఎవరికి ముప్పు లేదని తెలిసి చాలా ఊరటగా ఉంది...కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నానని మిల్లిస్ ఒక వార్తా సమావేశంలో ప్రకటించారు. కాగా బుధవారం (అక్టోబరు 25) రాత్రి మైనేలోని లెవిస్టన్లోని బౌలింగ్ అల్లే, రెస్టారెంట్లో రాబర్ట్ విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 16 మందిని చని పోయారు. వీరిలో 70 ఏళ్ల భార్యాభర్తలు, తండ్రితో పాటు హత్యకు గురైన 14 ఏళ్ల బాలుడి వరకు బాధితులను అధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ ఘటనలో మరో 50-60 మంది దాకా గాయ పడిన సంగతి తెలిసిందే. 2017లో లాస్ వెగాస్ మ్యూజిక్ ఫెస్టివల్లో 60 మంది మరణించిన ఘటన, అలాగే 2022లో టెక్సాస్‌లోని ఉవాల్డేలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ముష్కరుడు కాల్పులు జరిపి, 19 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులను చంపిన ఘటన తరువాత ఇదే అత్యంత ఘోరమైన కాల్పులు కావడంతో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. #WATCH | Maine, US: The Maine state police find the body of the suspect, Robert Card, in the shooting at multiple locations. At least 16 people were killed and 50-60 wounded in mass shootings in Lewiston, Maine in the US on Wednesday. Department Of Public Safety Commissioner… https://t.co/6g3iEBeCL8 pic.twitter.com/X73QdSNBgy — ANI (@ANI) October 28, 2023 -
అమెరికా పరిస్థితి మరీ దారుణం.. లైసెన్స్ చూపిస్తే తుపాకీ ఇవ్వాల్సిందే!
అగ్రరాజ్యం అమెరికాలో తరచూ కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల మూడు వేరు వేరు ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్మూన్ బేలో రెండు ప్రాంతాలు తుపాకీ మోతలతో దద్దరిల్లాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మౌంటైన్ మష్రూమ్ సోయిల్ ఫామ్‌లో ఈ కాల్పులు జరిగినట్లు వెల్లడించారు పోలీసులు. షూటర్‌ను స్పాట్లోనే అరెస్ట్ చేశారు. మరోవైపు డెస్ మొయిన్స్లోని ఓ స్కూల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మరణించగా.. ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డాడు. అమెరికాలో ఇలా తుపాకీ కాల్పులు జరగడం కొత్త కాదు. ఏటా తుపాకీ కాల్పుల్లో ఎందరో అమాయకులు చనిపోతున్నారు. అగ్రరాజ్యం పేరును తుపాకీ రాజ్యంగా మారిస్తే బెటరన్న సెటైర్లు వినపడుతున్నాయి. ఎందుకంటే 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో తుపాకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే గుండె గుభేల్ మంటుంది. అమెరికాలో అక్షరాలా 39 కోట్లకు పైగా తుపాకులు ఉన్నాయి. అవి 33 కోట్ల మంది ప్రజల ఇళ్లల్లో ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉన్నాయి. 1968 నుండి 2017 వరకు 50 ఏళ్ల వ్యవధిలో అమెరికాలో తుపాకులు 15 లక్షలమంది ప్రాణాలు తీసేశాయి. వాటిలో ఆత్మహత్యలూ ఉన్నాయి. హత్యలూ ఉన్నాయి. ఆకతాయిగా చిన్నపిల్లలే దీపావళి తుపాకీ కాల్చినట్లు కాల్చి సాటి పిల్లల్ని హతమార్చిన ఘటనలూ ఉన్నాయి. 1775లో అమెరికా స్వాతంత్ర్య పోరాటం నాటి నుండి ఇప్పటి వరకు అమెరికాలో జరిగిన అన్ని యుద్ధాలు.. అమెరికా సైన్యం పాల్గొన్న అన్ని యుద్ధాల్లో కలుపుకున్నా అమెరికాలో తుపాకుల బారిన పడి చనిపోయిన వారికన్నా తక్కువ మందే మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా నేవల్ బేస్ పెరల్ హార్బర్ పై జపాన్ చేసిన మెరుపుదాడిలో చనిపోయింది కేవలం 2400 మంది మాత్రమే. సెప్టెంబరు 11న ట్విన్ టవర్స్ పై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో మూడువేల చిల్లర మంది మాత్రమే చనిపోయారు. అంతకు ఎన్నో వందల రెట్లు మంది ఏటా తుపాకీ కాల్పుల్లో చనిపోతున్నారు. సగటున ప్రతీ ఏటా 41 వేల మంది తుపాకీ గుళ్లకు తలలు వాల్చేస్తున్నారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రతీ రోజూ సగటున 53 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు అయిదు నెలలు పూర్తి కాకుండానే తుపాకీ కాల్పుల్లో 17 వేల మందిచనిపోయారు. రాబోయే 7 నెలల్లో ఇంకెంతమందిని తుపాకులు పొట్టన పెట్టుకుంటాయో చెప్పలేని పరిస్థితి. బొమ్మలు కొన్నంత ఈజీగా.. మన దగ్గర సూపర్ మార్కెట్ల తరహాలోనే అమెరికాలో తుపాకుల దుకాణాలు లాభసాటి వ్యాపారాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నాయి. తుపాకీ కొనడానికి కూడా పెద్ద కష్టపడక్కర్లేదు. ఎవరికైనా లైసెన్స్ ఉంటుంది. దాన్ని చూపిస్తే చాలు షాప్‌లో తుపాకీ అమ్మేస్తారు. ఆ తుపాకీ కూడా పెద్ద ఖరీదేం కాదు. నలుగురు యువకులు ఓ మందు పార్టీకి ఖర్చుపెట్టే సొమ్ముతో ఓ మాంచి తుపాకీ వచ్చేస్తుంది. తుపాకీ కొనడానికి కూడా పెద్ద ఆంక్షలు లేవు. 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా సరే అమెరికాలో యధేచ్ఛగా తుపాకీ కొనుక్కోవచ్చు. దాన్ని జేబులో పెట్టుకుని తిరగచ్చు. తుపాకీ ఎందుకు కొన్నావ్? జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావ్? అని ఎవరూ అడగరు. చిత్రం ఏంటంటే అమెరికాలో మద్యం కొనడానికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. కానీ తుపాకీ మాత్రం 18 ఏళ్లు నిండితే చాలు. ఇంత లిబరల్ గా తుపాకులు అమ్మేస్తున్నారు కాబట్టే కొనేవాళ్లు కొనేస్తున్నారు. కొన్న తర్వాత ఇళ్లల్లో బీరువాల్లో దాచుకుని మురిసిపోతున్నారు. ఏక్షణంలో నైనా తమ తుపాకీని ఓసారి కాల్చాలని అనిపిస్తే కాల్చేస్తున్నారు. తుపాకుల అమ్మకం అమెరికాలో అతి పెద్ద వ్యాపారం. ఒక్క 2020 లోనే అమెరికాలో 26 లక్షల తుపాకులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇంత విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులో ఉండడం వల్లనే అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇప్పుడు పుట్టింది కాదు.. అమెరికాలో తుపాకీ సంస్కృతి ఇప్పుడు పుట్టింది కాదు. బ్రిటిష్‌తో స్వాతంత్ర్య పోరాటం చేసే సమయంలో పూర్తి స్థాయి ఆర్మీ లేని అమెరికా పౌరులందరికీ తుపాకులు కలిగి ఉండే హక్కు కల్పించింది. అవసరం వచ్చినపుడు ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత తుపాకులతో యుద్దంలో పాల్గొనాల్సి ఉండేది. దీంతో పాటే ఆహారం కోసం వేటపై ఆధార పడే వాళ్లకు తుపాకులు కలిగి ఉండే హక్కు ఉండేది. అమెరికాకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని రెండవ సవరణలో ప్రతీ అమెరికన్ పౌరుడూ తుపాకీ కలిగి ఉండే స్వేఛ్చను కల్పించారు. శతాబ్ధాల క్రితం పౌరులకు సంక్రమించిన ఈ రాజ్యాంగ బద్ధ హక్కే ఇపుడు అమెరికాని ఆందోళనలోకి నెట్టేస్తోంది. విచ్చలవిడిగా తుపాకులు అందుబాటులో ఉండడం వల్లనే అమెరికాలో హింస పేట్రేగిపోతోందా? లేక విశృంఖలంగా తుపాకీలు కాల్చేవారిలో మానసిక పరమైన రుగ్మతలు ఏమన్నా ఉన్నాయా అన్న కోణాల్లో సైంటిస్టులు అధ్యయనాలు చేశారు. వాటిలో ఆసక్తికరమైన నిజాలు వెలుగు చూశాయి. కొంత మందిలో మానసిక సమస్యలు ఉంటాయి. అలాంటి వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో వారికి తెలీదు. అటువంటి వారు తమ చేతుల్లో ఉన్న తుపాకులను తమపై వినియోగించుకోవచ్చు లేదంటే ఎదుటి వారిని కాల్చి చంపనూ వచ్చు. అందు చేత ఇది మానసిక పరమైన సమస్యే అంటున్నారు వారు. దీనికి ఇంటిమిటెంట్ ఎక్ప్ ప్లోజివ్ డిజార్డర్ అని పేరు పెట్టారు. ఆ సమస్య ఉన్నవాళ్లకి ఉన్నట్లుండి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంలో వాళ్లు ఎంతకైనా తెగిస్తారు. తమ చేతుల్లో తుపాకీ ఉంటే అయిన వాళ్లను కూడా కాల్చి చంపేస్తారు. ఆమధ్య టెక్సాస్ లో 18ఏళ్ల కుర్రాడు తన 18వ పుట్టినరోజు జరుపుకున్న మర్నాడే దుకాణానికి వెళ్లి ఓ తుపాకీ కొన్నాడు. వెంటనే ఫేస్ బుక్ లో తాను ఆ తుపాకీతో స్కూల్ కి వెళ్లి కాలుస్తానని పోస్ట్ పెట్టాడు కూడా. అయితే దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఆ కుర్రాడు తాను కొన్న తుపాకీతో తన నాయనమ్మను కాల్చి చంపి ఆ తర్వాత స్కూల్ కి వెళ్లి పదేళ్ల వయసుండే పిల్లలపై కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 19 మంది అక్కడి కక్కడే చనిపోయారు. ఆయుధ వ్యాపారులదే పవర్.. అదీ కాక తుపాకుల వ్యాపారంలో మునిగి తేలే ఆయుధ వ్యాపారులే అమెరికాని శాసిస్తూ ఉంటారు. ఆయుధ వ్యాపారులకు కోపం తెప్పించే పని చేయడానికి ఏ ప్రభుత్వమూ సాహసించదు. గతంలో తుపాకుల విక్రయాలపై ఆంక్షలు ఉండాల్సిందేనని బారక్ ఒబామా గట్టిగానే అన్నారు కానీ రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా ఆపని చేయలేకపోయారు. ఒబామా తర్వాత అధ్యక్షుడైన ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నేత కాబట్టి తుపాకులకు సహజంగానే సానుకూలం. ఇపుడు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ అధ్యక్షుడి గా ఉన్నాడు. ► 1999లో కొలరాడో లో తుపాకీ కాల్పుల్లో 12 మంది చిన్నారులు మృతి చెందారు. ► 2005 మార్చ్ లో మిన్నెసోటా లో కాల్పుల ఘటనలో ఏడుగురు చనిపోయారు. ► 2007 లో వర్జీనియాలో కాల్పుల్లో 32 మంది చనిపోయారు. ► 2012లో కనెక్టికట్ లో 26 మంది దుర్మరణం చెందారు. ► 2015లో ఓరేగాన్ లో 9 మంది విగతజీవులయ్యారు. ► 2018లో హ్యూస్టన్ లో 10 మంది ,ఫ్లోరిడాలో 17 మంది చనిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషాదాలు. అమెరికా చరిత్ర నిండా ఎన్నో బుల్లెట్ గాయాలు. తల్లిదండ్రులకు తీరని గర్బశోకాలు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ తుపాకులను ఇంత విచ్చలవిడిగా వినియోగించిన దాఖలాలు లేవు. తుపాకుల విక్రయంలోనూ అమెరికాకు దరిదాపుల్లో మరో దేశం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో పాలకుల నిర్లక్ష్యమే అతి పెద్ద విలన్ అంటున్నారు మేథావులు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరచి తుపాకీల వ్యాపారంపైనా వాటి వినియోగంపైనా ఉక్కుపాదం మోపకపోతే అమాయక బాల్యం తుపాకీ కాల్పుల్లో కాలిపోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: ప్రపంచదేశాలకు ‘చెత్త’ సవాల్.. ఆకాశం కూడా ఆగమాగం.. ఏంటీ పరిస్థితి? -
తుపాకీ మరణాలు ఆగేదెన్నడు?
గత బుధవారం ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు వద్ద జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో 9 సంవత్సరాల పాపతోపాటు నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. దానికి కొద్దిరోజుల ముందు కొలరాడో సరుకుల దుకాణంలో పదిమంది, అట్లాంటా ప్రాంతంలోని మసాజ్ కేంద్రంలో 8 మంది వ్యక్తులు దుండగుల కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయారు. 1975 నుంచి అమెరికాలో జరిగిన ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాలలో మరణాలు (15 లక్షల మంది), అమెరికా స్వాతంత్య్ర యుద్ధ కాలం నుంచి ఆ దేశ చరిత్రలో జరిగిన అన్ని యుద్ధాల్లో సంభవించిన మరణాలను (14 లక్షల మంది) మొత్తంగా కలిపి చూసినా సరే అమెరికాలో తుపాకీ కాల్పుల వల్లే ఇంకా ఎక్కువమంది ప్రజలు మరణించారని సమాచారం. ఈ కాల్పుల్లో ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఒక ఏడాదిలోపే నాలుగేళ్ల పిల్లలను 80 మందిని తుపాకులు పొట్టన బెట్టుకుంటున్నాయి. అదే సమయంలో 50 మంది కంటే తక్కువగానే పోలీసు అధికారులు కాల్పుల్లో చనిపోతున్నారు. భారీ కాల్పులకు ఉపయోగపడే తుపాకుల పట్ల చాలామందికి ఆకర్షణ ఎక్కువ. గతంలో అమెరికన్లు వేటాడటం కోసం ఉపయోగించే తుపాకులు నేరాలకు ఎన్నడూ వాడేవారు కాదు. కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా అంతగా ప్రమాదం కలిగించని ఆయుధాల స్థానంలో మిలటరీ ఉపయోగించే సెమీ–ఆటోమేటిక్ రైఫిల్స్ అంటే ఏఆర్–15 లేదా ఏకే–47 వంటి మారణాయుధాలు వచ్చి చేరుతున్నాయి. వీలైనంత ఎక్కువ మందిని చంపాలని కోరుకున్నప్పుడు మారణాయుధాలే వ్యక్తుల ఎంపికగా మారుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో ఇపుడున్న పరిస్థితుల్లో తుపాకుల నిరోధక చట్టం వంటిది తీసుకురావడం అసాధ్యం, అసంభవమే అని చెప్పాలి. ఉదారవాదులు పదేళ్లపాటు మారణాయుధాలపై నిషేధించాలని కోరుతూ వచ్చారు కానీ అది ప్రాణాలను కాపాడినట్లు బలమైన సాక్ష్యం కనిపించడం లేదు. కానీ ఏఆర్–15 ఒక సాంప్రదాయిక చిహ్నంగా మారిపోయింది కాబట్టే ఈరోజు అమెరికా సైన్యం వద్ద కంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఏఆర్, ఏకే రైఫిల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా రైఫిల్స్ కంటే ఇలాంటి హ్యాండ్ గన్స్ వల్లే ఎక్కువగా నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. ఎలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా మార్కెట్లోకి వస్తున్న ఈ మారణాయుధాలను (వీటినే అమెరికాలో దెయ్యపు తుపాకులు అంటారు) తన కార్యనిర్వాహక ఆదేశం ద్వారా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అరికట్టవచ్చు. ఎందుకంటే వీటిలో చాలావరకు పూర్తి తయారీ కాని తుపాకులుగానే ముద్రపడుతూ బయటికి వస్తున్నాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన తుపాకీ హింసలపై నిపుణుడు డాక్టర్ గరెన్ వింటెముట్ దీనిపై జోక్ చేస్తూ ‘దెయ్యపు తుపాకులను సొంతం చేసుకున్నారు. వాటిని కనిపెట్టడం అసాధ్యం’ అంటూ వ్యాఖ్యానించారు. జాతీయవాదులు దీన్ని సాకుగా తీసుకుని ఈ ఘోస్ట్ గన్స్ నుంచి రహస్యంగా మారణాయుధాల తయారీకి పూనుకుంటున్నారు. గత సంవత్సరం అలాంటి తుపాకీతోనే అతివాద ఉద్యమ మద్దతుదారు నిఘా అధికారిని కాల్చి చంపాడు. పోతే మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మార్ని అపహరించాలని ప్రయత్నించిన వ్యక్తి కూడా ఈ ఘోస్ట్ గన్నే కలిగి ఉండటం గమనార్హం. 2019లో ఒక్క సంవత్సరంలోనే 10 వేలకు పైగా దెయ్యపు తుపాకులను నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అధ్యక్షుడు బైడెన్ ఈ ఘోస్ట్ గన్స్ ప్రమా దాన్ని తగ్గించడానికి వెంటనే కార్యనిర్వాహక ఆదేశాన్ని ఇవ్వడం మంచిది. ఈ తుపాకులను ఎక్కడెక్కడ నేరాల్లో ఉపయోగించారో డేటాను సేకరించాలి. రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం తుపాకుల నియంత్రణలో ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు కూడా అమెరికాలో తుపాకీ మరణాలను అంత సులభంగా తగ్గించలేవు. కానీ తుపాకుల నిషేధం దిశగా తీసుకునే కనీస చర్యలు కూడా అమెరికా సమాజాన్ని ఎంతో కొంత సురక్షితంగా ఉంచుతాయనడంలో సందేహం లేదు.. వ్యాసకర్త: నికోలస్ క్రిస్టాఫ్ అమెరికన్ జర్నలిస్ట్, పులిట్జర్ గ్రహీత -
అమెరికా చరిత్రలోనే ఘోర మారణకాండ
-
అమెరికా చరిత్రలోనే ఘోరమారణకాండ
కేసినోలకు, నైట్ క్లబ్‌లకు ఫేమస్ అయిన లాస్‌వెగాస్‌లో నరమేధం సృష్టించాడో రాక్షసుడు. విశాల ప్రాంగణంలో జేసన్ ఆల్డీన్ సంగీతాన్ని ఆస్వాదిస్తున్న భారీ జనసముదాయంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ మ్యూజిక్ కన్సర్ట్ జరుగుతున్న ప్రదేశానికి పక్కనే ఉన్న ఒక హోటల్లోని 32వ అంతస్తులోని తన గదిలోని కిటికీ నుంచి తాపీగా కిందనున్న అమాయక ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఎక్కడినుంచి దూసుకొస్తున్నాయో తెలియని బుల్లెట్లు శరీరాల్ని ఛిద్రం చేస్తోంటే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడి ప్రజలు సురక్షిత ప్రదేశం కోసం పరుగులు పెట్టారు. ఈ కాల్పుల్లో 5 వందల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ మారణకాండకు పాల్పడిన, స్థానికుడైన స్టీఫెన్ పెడాక్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ఈ ఘటనలో ఉగ్రవాద కోణాన్ని ఎఫ్‌బీఐ తోసిపుచ్చగా.. ఈ కాల్పులకు పాల్పడింది తమ సైనికుడేనని ఐసిస్ ప్రకటించింది. లాస్‌వెగాస్: అమెరికాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. లాస్‌వెగాస్‌లో ఆహ్లాదంగా సాగుతున్న మ్యూజిక్ కన్సర్ట్ (సంగీత విభావరి)పై విచ్చలవిడిగా కాల్పులు జరిపి 58 మందిని పొట్టనపెట్టుకున్నాడు. కన్సర్ట్ వేదిక పక్కనున్న హోటల్లోని 32వ అంతస్తునుంచి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. పైనుంచి కాల్పులు జరగటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎటుపోవాలో తెలియక బాధితులు తోచిన వైపు పరుగులు తీశారు. ఉన్మాది మారణకాండతో సంగీతవిభావరి ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. ఈ ఘటనలో 500 మందికి పైగా గాయాలయ్యా యి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు కారకుడైన ఉన్మాది స్టీఫెన్ పెడాక్ (64) అనంతరం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యులమని, కొద్ది నెలల క్రితమే పెడాక్ ఇస్లాం మతం స్వీకరించాడని ఐసిస్ పేర్కొంది. అయితే ఇది ఉన్మాద చర్యేనని.. ఉగ్ర ఘటనగా భావించట్లేదని ఎఫ్‌బీఐ పేర్కొంది. ఈ ఘటనపై ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, లాస్‌వెగాస్ బాధితుల్లో భారతీయులెవరూ లేరని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అసలేం జరిగింది? ‘రూట్ 91’ పేరుతో లాస్‌వెగాస్‌లోని మాండలే బేలో మూడ్రోజుల మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతోంది. దాదాపు 30వేల మంది సంగీతాభిమానులు చుట్టు పక్కల రాష్ట్రాలనుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. కచేరీ ఉత్సాహంగా సాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి పదిగంటల సమయంలో కన్సర్ట్‌లో అందరూ ఉత్సాహంగా ఉన్న సమయంలో హఠాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. దీంతో కన్సర్ట్‌లో కలకలం రేగింది. ఎక్కడినుంచి వస్తున్నాయో తెలియని గుళ్ల వర్షం నుంచి తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎత్తైన భవనం పైనుంచి పక్కా వ్యూహంతో జరిపిన ఈ కాల్పులు సంగీతాభిమానుల ప్రాణాలను బలితీసుకున్నాయి. ఎటువెళ్లాలో అర్థం కాక ఆర్తనాదాలతో తలోదిక్కుకు పారిపోయే ప్రయత్నంలో మరింత గందరగోళం నెలకొంది. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు, వైద్యులు పేర్కొన్నారు. 32వ అంతస్తు నుంచి కన్సర్ట్ వేదిక పక్కనే మాండలే బే కాంప్లెక్స్ ఉంది. ఈ భవనం 32వ అంతస్తులోని హోటల్ గదిలో స్టీఫెన్ పెడాక్ మకాం వేశాడు. ఈ ఘటన కోసం వ్యూహాత్మకంగానే ఎత్తైన భవంతిని పెడాక్ ఎంచుకున్నాడు. ఈయన ఉన్న గది నుంచి కన్సర్ట్ జరుగుతున్న ప్రాంతం 1700 అడుగుల దూరం (ఏటవాలుగా 518 మీటర్లు) ఉంది. పైనుంచి బుల్లెట్లు దూసుకొస్తుండటంతో కచేరీలో ఉన్న వారికి కూడా ఎటుపోవాలో తోచలేదు. దీని కారణంగానే మృతులు, బాధితుల సంఖ్య పెరిగింది. కాల్పులు పక్కనున్న హోటల్ భవంతి నుంచి వస్తున్నాయని గుర్తించిన పోలీసులు 32వ అంతస్తులోని ఆ గదిలోకి చేరుకునేసరికే.. పెడాక్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. పోలీసులు ఆ గది నుంచి 10 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఘటన జరిగిన సమయంలో అతనితోపాటు ఓ మహిళ ఉందని గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఘటనతో ఆ మహిళకు సంబంధం లేదని నిర్ధారించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనగా ఈ కన్సర్ట్ కాల్పులను పేర్కొన్నారు. ‘ఈ దారుణ ఘటనలో 58 మంది మరణించారు. 200 మంది వరకు గాయపడి ఉంటారని మొదట భావించాం. కానీ 515 మందిని ఆసుపత్రులకు తీసుకెళ్లాం. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది’ అని పోలీసు ఉన్నతాధికారి లోంబార్డో తెలిపారు. లాస్ వెగాస్‌కు 130కిలోమీటర్ల దూరంలోని మెస్క్విట్ పట్టణంలోని పెడాక్ ఇంటిలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. అతని ఇంటినుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గాజు పగిలిందనుకున్నాం! ‘కచేరీలో మునిగిపోయి ఉండగా.. ఒక్కసారి గాజు పగిలిన శబ్దం వచ్చింది. ఏం జరిగిందని తెలుసుకునే లోపే బుల్లెట్లు దూసుకొచ్చాయి. కాసేపటికి కాల్పులు ఆగిపోయాయనుకున్న సమయంలో మళ్లీ బుల్లెట్ల వర్షం మొదలైంది’ అని మోనిక్ డెకెర్ఫ్ అనే బాధితుడు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో అమెరికా విఖ్యాత గాయకుడు జేసన్ అల్డీన్ వేదికపై ఉన్నారు. ‘15–20 మంది నా కళ్లముందే చనిపోవటం చూశాన’ంటూ మరో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో చాలా మంది.. ‘కాల్పుల శబ్దం కన్సర్ట్ సౌండ్ ఎఫెక్ట్ లో భాగమనే అనుకున్నాం. క్షణాల్లోనే కన్సర్ట్ మ్యూజిక్ కాదు.. నిజంగానే కాల్పులు జరుగుతున్నాయని అర్థమైంది’ అని పేర్కొన్నారు. మ్యూజిక్ కన్సర్ట్ ఓ యుద్ధభూమిని తలపించింది. అత్యవసర సిబ్బంది చేతికందిన టేబుళ్లు, మెటల్ రెయిలింగ్‌లను స్ట్రెచర్లుగా వినియోగించి.. బాధితులను వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ప్రముఖుల దిగ్భ్రాంతి భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాధినేతలు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీన్ని భయంకరమైన దుర్ఘటనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బాధితులకు దేశమంతా అండగా ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. లాస్‌వెగాస్ ఘటనకు సంతాపంగా వైట్హౌజ్తోపాటుగా ప్రభుత్వ కార్యాలయాలపై అమెరికా జాతీయ జెండాను అవనతం చేశారు. ‘మతిలేని ఈ దుశ్చర్య.. కలచివేసింది’ అని పోప్ ఫ్రాన్సిస్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఘోరమైన దాడిగా అభివర్ణించిన బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. బాధితులకు సానుభూతి తెలిపారు. గతేడాది జూన్‌లో ఫ్లోరిడాలోని పల్స్ నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల దుర్ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 2015 నవంబర్‌లో పారిస్‌లోని బాటక్లాన్లో జరిగిన ఓ కన్సర్ట్పై జరిగిన దాడిలో 90 మంది మృతిచెందారు. అది మా పనే: ఐసిస్ మ్యూజిక్ కన్సర్ట్పై కాల్పుల ఘటనకు తమదే బాధ్యతని ఐసిస్ పేర్కొంది. ‘లాస్‌వెగాస్ దాడికి కారకుడు మా సైనికుడే. మా సూచన మేరకే పెడాక్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఐసిస్ జిహాదీలపై దాడులకు పాల్పడే దేశాలకు ఇదే గతి పడుతుంది. పెడాక్ కొద్ది నెలల క్రితమే ఇస్లాం స్వీకరించాడు’ అని ఐసిస్ సమాచార విభాగం అమాక్ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ ఘటనలో ఉగ్రకోణమేదీ కనబడలేదని ఎఫ్‌బీఐ తెలిపింది. ఇప్పటివరకు జరిగిన విచారణలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పెడాక్‌కు ఎటువంటి సంబంధం లేదని తేలిందని స్పష్టం చేసింది. పెడాక్ అమెరికాకు చెందిన విమానయాన, భద్రత సంస్థ ‘లాక్‌హీడ్ మార్టిన్’లో 1985 నుంచి 1988 వరకు పనిచేశాడు. అమెరికాలో రక్తచరిత్ర నెవడాలోని లాస్ వెగాస్లోకాల్పులు (2017) ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్‌క్లబ్ (2016) వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ 2007) కనెక్టికట్‌లోని శాండీహుక్ స్కూల్ (2012) టెక్సాస్‌లోని లూబీ రెస్టారెంట్లో (1991) కాలిఫోర్నియాలోని మెక్‌డొనాల్డ్‌లో (1984) శాన్ బెర్నార్డినో దాడి (2015) ఎడ్మండ్ పోస్టాఫీస్‌లో కాల్పులు (1986) ఫోర్డ్వుడ్లో కాల్పులు (2009) బిగ్హాంప్టన్లో కాల్పులు (2009) కొలరాడోలోని అరోరాలో (2012) ప్రాణాలతో బయటపడ్డాం.. సాక్షి, అమరావతి: అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన కాల్పుల ప్రాంతంలో చిక్కుకున్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. భీమవరంకు చెందిన కర్రి ప్రేమ్ కుమార్(జర్నలిస్టు), మల్లినీడి తిరుమలరావు (బాబి, రియల్టర్), నారాయణ (వ్యాపారి), మరో ఇద్దరు సెప్టెంబర్ 15న అమెరికా పర్యటనకు వెళ్లారు. వేర్వేరు నగరాల్లో పర్యటించి చివరిగా లాస్‌వెగాస్‌కు వచ్చారు. అక్కడ కాల్పులు చోటుచేసుకోవడంతో పోలీసుల సహకారంతో ప్రాణాలతో బయటపడి హోటల్లో తలదాచుకున్నారు. అసలేం జరుగుతోందో అర్థంకాలేదు:ప్రేమ్‌కుమార్ ‘శుక్రవారం లాస్‌వెగాస్‌కు వచ్చాం. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కాసినో గేమ్ బోర్డుల వద్ద చూస్తున్నాం. అదే సమయంలో మా హోటల్ పక్కనున్న మరో హోటల్లో సంగీత కచేరి జరుగుతోంది. కచేరీకి దాదాపు 25 వేల మంది ప్రేక్షకులొచ్చారు. ఒక్కసారిగా కాల్పుల మోత విన్పించడంతో ప్రేక్షకులంతా చెల్లాచెదురుగా పరుగెత్తారు. ఏం జరుగుతుందో అర్థంకాలేదు. భయంతో ఒకరినొకరు తొక్కుకుంటూ పరుగెత్తారు. అందరూ సేఫ్‌జోన్‌కు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సంకేతాలిచ్చారు. హోటల్లో ఓదుండగుడు కాల్పులు జరుపుతున్నట్టుగా మాకు సమాచారం అందింది. చాలా మంది హోటళ్లలో సేఫ్జోన్లో ఉన్నారు. విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే ఇక్కడి నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నాం’. -
ఫలించిన ‘తుపాకీ సంస్కరణలు’
20 ఏళ్లలో ఆస్ట్రేలియాలో కాల్పులు, దాడుల తగ్గుదల మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో 20 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన తుపాకుల సంస్కరణలు, ఆయుధాల ఉపసంహరణ కార్యక్రమం తరువాత ఉద్దేశపూర్వక దాడులు, మారణ కాండలు గణనీయంగా తగ్గినట్లు సిడ్నీ విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. సంస్కరణలకు ముందు 18 ఏళ్లలో అక్కడ 13 భీకర సామూహిక కాల్పులు జరిగాయి. 1996లో టాస్మానియాలో ఓ వ్యక్తి రెండు రైఫిళ్లతో 35 మందిని కాల్చి చంపి, 19 మందిని గాయపరిచాడు. తదుపరి ఆస్ట్రేలియాలో విప్లవాత్మక మార్పులు చేపట్టారని పరిశోధకులు తెలిపారు. అదే సంవత్సరం జూన్‌లో రాపిడ్ లాంగ్ తుపాకులు, ప్రైవేటు వ్యక్తుల వద్దనున్న ఆయుధాలను నిషేధిస్తూ ఫెడరల్ ప్రభుత్వం చట్టం చేసింది. 1997 జనవరి1 నుంచి ఫెడరల్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ ధరకే నిషేధిత ఆయుధాల తిరిగి కొనుగోలును ప్రారంభించాయని అధ్యయనకర్తలు వెల్లడించారు. ఈ 20 ఏళ్లలో సుమారు 10 లక్షల నిషేధిత ఆయుధాలను ప్రజలు స్వచ్ఛందంగా వదులుకున్నారు.