రాయ్‌పూర్ : కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు మృతి ఘటన మరువక ముందే ఛత్తీస్‌గడ్‌లోనూ మరో ఘటన వెలుగు చూసింది. రాయ్‌పూర్‌కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ప్రతాపూర్ అటవీ ప్రాంతంలో రెండు ఏనుగుల మృతదేహాలు లభించినట్లు బుధవారం అటవీ అధికారులు పేర్కొన్నారు. వీటిలో ఒకటి 20 నెలల గర్భంతో ఉన్నట్లు తెలిపారు. ప్రతాపూర్ అటవీ పరిధిలోని గణేష్‌పూర్ ప్రాంతంలో వేర్వేరు ప్రదేశాల్లో రెండు ఏనుగుల మృతదేహాలు లభ్యమయ్యాయని అటవీశాఖ అదనపు ఛీప్ అరుణ్ కుమార్ పాండే పేర్కొన్నారు. గర్భంతో ఉన్న ఏనుగు కాలేయ సంబంధిత సమస్యలతో చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలిందని చెప్పారు. మృతదేహాల వద్ద భారీగా మిగతా ఏనుగులు గుమి కూడటంతో మరో ఏనుగు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేకపోయామని జిల్లా అటవీ అధికారి ఒకరు వెల్లడించారు. (పరిస్థితి ఆందోళనకరం: అమిత్ షాతో భేటీ )
Two female elephants have died in Surajpur Forest Division in the State of Chhattisgarh. CWLW, Chhattisgarh is visiting the area and ascertaining the facts. State Forest Department is requested to take action as appropriate and appraise the facts to the Ministry, immediately.
— MoEF&CC (@moefcc) June 10, 2020
గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద సంచరిస్తుందని మరో ఏనుగు మృతికి గత కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అటవీ అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఛత్తీస్‌గడ్ అటవీ శాఖ అధికారులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది. ఇక కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పేలుడు పదార్థం నిండిన పైనాపిల్ తినడంతో గర్భిణీ ఏనుగు చనిపోయిన సంగతి తెలిసిందే. (జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు: గడ్కరీ )
.
Comments
Please login to add a commentAdd a comment