Maha Kumbh: పుణ్యస్నానాలు ప్రారంభం | Prayagraj Maha Kumbh Mela 2025 Holy Bath Begins, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

Maha Kumbh Mela 2025: పుణ్యస్నానాలు ప్రారంభం

Published Mon, Jan 13 2025 7:34 AM | Last Updated on Mon, Jan 13 2025 10:26 AM

prayagraj maha kumbh 2025 Holy bath begins

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, అదృశ్య సరస్వతి సంగమం ఒడ్డున 45 రోజుల పాటు వైభవంగా జరిగే కుంభమేళా సోమవారం (జనవరి 13) వేకువజామునే ప్రారంభమయ్యింది. సముద్ర మథనం సమయంలో కలశం నుంచి వెలువడిన కొన్ని చుక్కల అమృత బిందువులు ‍ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో పడ్డాయి. ఈ నేపధ్యంలోనే ఇక్కడ కుంభమేళా జరుగుతోంది. ఫిబ్రవరి 26 వరకు ఈ మహా ఉత్సవం కొనసాగనుంది.


సంగమతీరంలో భక్తులు తమ భక్తిప్రపత్తులను చాటుకుంటున్నారు.

సాధారణ భక్తులతో పాటు సంగమతీరంలో బాబాలు, స్వామీజీలు కూడా కనిపిస్తున్నారు.

భక్తుల రద్దీ మధ్య వారి భద్రతను నిర్ధారించడానికి ఆర్‌ఏఎఫ్‌, పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి.
 

రాత్రంతా క్యూకట్టిన భక్తులు మహా కుంభమేళాలో మొదటి స్నానం కోసం సంగమం వైపు కదులుతున్నారు. జనసమూహం అంతకంతకూ పెరుగుతోంది.

మహా కుంభమేళా(maha kumbh 2025)లో తొలి స్నానం చేయాలనే తపన వృద్ధులలో కనిపిస్తోంది. చలి  అధికంగా ఉన్నప్పటికీ, వృద్ధులు, మహిళలు పుణ్యస్నానాలు చేయడానికి సిద్దమయ్యారు.

విదేశీ భక్తుల బృందం కూడా పవిత్ర స్నానం ఆచరించింది. మహా కుంభమేళాలో తొలి స్నానం చేయాలని భక్తులు ఉత్సాహం చూపుతున్నారు.  గంగామాతపై పాటలు పాడుతూ సంగమతీరానికి చేరుకుంటున్నారు.

మహా కుంభమేళా మొదటి రోజున సంగమంలో స్నానం చేసిన బ్రెజిల్‌కు చెందిన ఫ్రాన్సిస్కో అనే భక్తుడు  మీడియాతో మాట్లాడుతూ తాను యోగా సాధన చేస్తుంటానని, మోక్షం కోసం పరితపిస్తున్నానని అన్నారు.

 

ఇది కూడా చదవండి: Maha Kumbh: 15 లక్షలకుపైగా విదేశీ పర్యాటకుల రాక
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement