ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా సందర్భంగా పవిత్ర సంగమం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కటౌట్‌లు ఇక్కడికి వచ్చేవారిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కుంభమేళాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
మహాకుంభమేళా సందర్భంగా పంచాయితీ అఖాడా ఇస్తున్న బడా హారతి భక్తులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో 40 నుండి 50 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా.
మహా కుంభమేళా సందర్భంగా ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ అలియాస్ కమల అఖాడ శ్రీ నిరంజని అధిపతి స్వామి కైలాసానంద గిరి నుండి ఆధ్యాత్మిక దీక్షను పొందారు.
2025 మహా కుంభమేళా సందర్భంగా జరిగిన శోభా యాత్రలో ఇస్కాన్ భక్తులు పాల్గొంటున్నారు. ఇతర దేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ఇస్కాన్ భక్తులు కుంభమేళాకు తరలివస్తున్నారు. వారు చేసే కీర్తనలు, భజనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మహా కుంభమేళా ప్రాంతంలో తీవ్రమైన చలి ఉన్నప్పటికీ భక్తులు అత్యంత ఉత్సాహంతో త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు. ‘హర్ హర్ మహాదేవ్’, ‘జై శ్రీరామ్’, ‘జై గంగా మాతా’ అని నినాదాలు చేస్తూ భక్తులు సంగమం వద్ద స్నానాలు ఆచరిస్తున్నారు.
మహాకుంభ ఉత్సవంలో సాధుసన్యాసులు భజన కీర్తలను ఆలపిస్తూ, ఆధ్యాత్మిక ప్రసంగాలు సాగిస్తున్నారు. వీరిని దర్శించుకునేందుకు జనం క్యూ కడుతున్నారు. మహా కుంభమేళాలో లక్షలాది మంది సాధువులు పాల్గొంటున్నారు.
విహంగ వీక్షణలో మహా కుంభమేళా వేదిక అత్యంత అద్భుతంగా కనిపిస్తోంది. ఫొటోలోని కొంతభాగమే ఇంత అందంగా ఉంటే.. పూర్తి చిత్రం ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులు మహా కుంభమేళాలో సంగమం దగ్గర స్నానాలు ఆచరించారు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా వివిధ అఖాడాలకు చెందిన సాధువులు తొలి అమృత స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు త్రివేణి సంగమంలో దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు స్నానమాచరించారు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: స్నానానికి 45 నిముషాలు.. ఆర్‌ఎఫ్ రిస్ట్ బ్యాండ్‌లో వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment