గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ మేళాకు వెళ్లారు. తన సోదరి, మరికొందరు స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్తున్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆరు గంటలకే ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం చేరుకున్నట్లు పోస్ట్‌లో తెలిపింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొద్ది రోజులు పలువురు సినీ ప్రముఖులు సైతం గంగానదిలో పవిత్రస్నానాలు ఆచరించారు. మూడు లడ్డూలతో కలిసి కుంభ్ మేళాను వెళ్తున్నానంటూ తన ఫ్రెండ్స్‌ను ఉద్దేశించి ఫన్నీగా రాసుకొచ్చింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ16తో బిజీగా ఉన్నారు. ఇటీవల షూటింగ్ సెట్‌లోని ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ చిత్రానికి బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నందున రామ్ చరణ్ యాత్రకు వెళ్లలేదు. ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ మూవీతో అభిమానులను పలకరించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయింది.
యూపీలో జరుగుతున్న కుంభ మేళాకు దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ తన తల్లితో కలిసి ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తన తల్లి మాధవితో కలిసి మహాకుంభ్ మేళాకు హాజరయ్యారు. కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఇటీవలే కుంభ్ మేళాలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment