ప్రయాగ్‌రాజ్: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో శుక్రవారం పర్యటించారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న క్రమంలో రూ.5,500 కోట్ల విలువైన కుంభమేళాకు సంబంధించి పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.
అనంతరం ప్రసిద్ధ అక్షయ వట వృక్షం వద్ద పూజలు నిర్వహించారు. హనుమాన్ మందిర్, సరస్వతి కూప్‌ను సందర్శించారు. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, చాట్‌బాట్ సేవలు వినియోగించుకోబోతున్నట్లు వెల్లడించారు. దేశప్రజలంతా ఈ మహా కుంభమేళాకు తరలి రావాలంటూ మోదీ పిలుపునిచ్చారు.
ఈ వేడుకను ప్రపంచ దేశాలు చర్చించుకునే మహా యజ్ఞంగా నిర్వహిస్తామన్న ప్రధాని.. భారత్ అంటేనే పవిత్ర స్థలాలకు పుట్టినిల్లుగా అభివర్ణించారు. మహా కుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్న కార్మికులను, అధికారులను ప్రధాని అభినందిస్తూ ఈ ప్రయాగ్‌రాజ్ భూమిపై కొత్త చరిత్ర సృష్టించబోతోందన్నారు.
కాగా, మహా కుంభ మేళాకి వచ్చే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు ఉత్సవ నిర్వాహకులు ఏఐ కెమెరాలతో పాటు.. ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. ఈసారి మహా కుంభమేళాలో సుమారు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కుంభ మేళాకు వచ్చే భక్తుల సంఖ్యను గుర్తించేందుకు 200 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ 35 నిమిషాలు.. సాధారణమా? రాజకీయమా?
Comments
Please login to add a commentAdd a comment