మహాకుంభమేళా ఆర్ట్ వర్క్‌తో అందమైన రూపాన్ని నింపుకుంది. కళాకారులు తమదైన శైలిలో భారతీయ సంస్కృతిని కళ్లకు కడుతున్నారు. రికార్డులు కొల్లగొడుతున్నారు. మహాకుంభమేళా ఈవెంట్‌కు దాదాపు 40 – 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా.
రూపు మారిన రైల్వే స్టేషన్లు
అధిక సంఖ్యలో భక్తులు రైలు ప్రయాణం ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల రైల్వే స్టేషన్లు హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన ఆకర్షణీయమైన కుడ్యచిత్రాలతో అందమైన హబ్‌లుగా మారిపోయాయి. రామాయణం, కృష్ణ లీల, లార్డ్ బుద్ధ, శివశక్తి, గంగా హారతి, మహిళా సాధికారత.. వంటి పౌరాణిక ప్రతిబింబాలను అందించడానికి థీమ్‌లను ఎంపిక చేశారు.
యాత్రికులకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సజీవంగా అందించడానికి, స్వాగతం పలకడానికి మన సంప్రదాయానిన ఈ విధంగా కళ్లకు కట్టారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ప్రయాగ్ జంక్షన్, ఝూన్సీ స్టేషన్, రాంబాగ్ స్టేషన్, చెయోకి, సంగం, సుబేదర్‌గంజ్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లను ’పెయింట్ మై సిటీ’ డ్రైవ్ కింద సుందరీకరించింది.
లోతైన సంస్కృతి
గురు–శిష్య బంధం, విజ్ఞానం, పరిత్యాగం సామరస్య సమ్మేళనంతో సహా ఒక లోతైన సంప్రదాయాలను నగరం లోపల గోడలపై కళాకారులు చిత్రించారు. ఈ శక్తివంతమైన ఈ కుడ్యచిత్రాలు ప్రతి మూల మహాకుంభ వైభవంతో ప్రతిధ్వనిస్తుందనడానికి నిదర్శనంగా నిలిచాయి.
‘రామ నామం’ మహాకుంభం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ మేళా సందర్భంగా చాలా మంది కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. మహాకుంభంలో ముఖ్యమైన ఆచారంగా ఉన్న అమృత కలశాన్ని కళాకారిణి ప్రతిభాపాండే ‘రామ నామం’తో చిత్రించింది.
‘ఈ కుంభ కళశాన్ని మహాకుంభ మేళాకు అంకితం చేస్తున్నాను. ఈ కళశాన్ని పూర్తి చేయడానికి ఏడు రోజులు పట్టింది. ఇది నాకు ధ్యాన వ్యాయామంలా ఉపయోగపడింది. గృహిణిగా ఇంటి పనులను త్వరగా పూర్తి చేసుకొని, పగలు–రాత్రి ఈ రామ కళశ కుంభాన్ని చిత్రించాను’ అని చెబుతోంది ఈ చిత్రకారిణి.
వరల్డ్ లార్జెస్ట్ రంగోళి రికార్డ్
ఇండోర్‌కు చెందిన శిఖా శర్మ నాయకత్వంలో రూపొందించిన అతి పెద్ద మహాకుంభ మేళా రంగోలీ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో యమునా క్రిస్టియన్ కళాశాల ప్రాంగణంలో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 11 టన్నుల సహజ రంగులను ఉపయోగించి, 72 గంటలలో శిఖా శర్మ, ఆమె బృందం ఈ రంగోలీని పూర్తి చేశారు. నదీ జలాలు, జన సంద్రం, పడవలు, భారీ సాధువు బొమ్మను ఇందులో చిత్రించారు.
(చదవండి: 'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!)
Comments
Please login to add a commentAdd a comment