Cultural Art
-
మది నిండుగా మహా కుంభమేళా!
మహాకుంభమేళా ఆర్ట్ వర్క్‌తో అందమైన రూపాన్ని నింపుకుంది. కళాకారులు తమదైన శైలిలో భారతీయ సంస్కృతిని కళ్లకు కడుతున్నారు. రికార్డులు కొల్లగొడుతున్నారు. మహాకుంభమేళా ఈవెంట్‌కు దాదాపు 40 – 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా.రూపు మారిన రైల్వే స్టేషన్లుఅధిక సంఖ్యలో భక్తులు రైలు ప్రయాణం ద్వారా ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల రైల్వే స్టేషన్లు హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన ఆకర్షణీయమైన కుడ్యచిత్రాలతో అందమైన హబ్‌లుగా మారిపోయాయి. రామాయణం, కృష్ణ లీల, లార్డ్ బుద్ధ, శివశక్తి, గంగా హారతి, మహిళా సాధికారత.. వంటి పౌరాణిక ప్రతిబింబాలను అందించడానికి థీమ్‌లను ఎంపిక చేశారు. యాత్రికులకు ఆధ్యాత్మిక వారసత్వాన్ని సజీవంగా అందించడానికి, స్వాగతం పలకడానికి మన సంప్రదాయానిన ఈ విధంగా కళ్లకు కట్టారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ప్రయాగ్ జంక్షన్, ఝూన్సీ స్టేషన్, రాంబాగ్ స్టేషన్, చెయోకి, సంగం, సుబేదర్‌గంజ్, ప్రయాగ్‌రాజ్‌తో సహా ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లను ’పెయింట్ మై సిటీ’ డ్రైవ్ కింద సుందరీకరించింది. లోతైన సంస్కృతిగురు–శిష్య బంధం, విజ్ఞానం, పరిత్యాగం సామరస్య సమ్మేళనంతో సహా ఒక లోతైన సంప్రదాయాలను నగరం లోపల గోడలపై కళాకారులు చిత్రించారు. ఈ శక్తివంతమైన ఈ కుడ్యచిత్రాలు ప్రతి మూల మహాకుంభ వైభవంతో ప్రతిధ్వనిస్తుందనడానికి నిదర్శనంగా నిలిచాయి. ‘రామ నామం’ మహాకుంభంఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్ మేళా సందర్భంగా చాలా మంది కళాకారులు తమ ప్రతిభను నిరూపించుకుంటూనే ఉన్నారు. మహాకుంభంలో ముఖ్యమైన ఆచారంగా ఉన్న అమృత కలశాన్ని కళాకారిణి ప్రతిభాపాండే ‘రామ నామం’తో చిత్రించింది. ‘ఈ కుంభ కళశాన్ని మహాకుంభ మేళాకు అంకితం చేస్తున్నాను. ఈ కళశాన్ని పూర్తి చేయడానికి ఏడు రోజులు పట్టింది. ఇది నాకు ధ్యాన వ్యాయామంలా ఉపయోగపడింది. గృహిణిగా ఇంటి పనులను త్వరగా పూర్తి చేసుకొని, పగలు–రాత్రి ఈ రామ కళశ కుంభాన్ని చిత్రించాను’ అని చెబుతోంది ఈ చిత్రకారిణి.వరల్డ్ లార్జెస్ట్ రంగోళి రికార్డ్ఇండోర్కు చెందిన శిఖా శర్మ నాయకత్వంలో రూపొందించిన అతి పెద్ద మహాకుంభ మేళా రంగోలీ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో యమునా క్రిస్టియన్ కళాశాల ప్రాంగణంలో 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 11 టన్నుల సహజ రంగులను ఉపయోగించి, 72 గంటలలో శిఖా శర్మ, ఆమె బృందం ఈ రంగోలీని పూర్తి చేశారు. నదీ జలాలు, జన సంద్రం, పడవలు, భారీ సాధువు బొమ్మను ఇందులో చిత్రించారు. (చదవండి: 'ఉనకోటి': నేలకు దిగివచ్చిన కైలాసం..!) -
జనం పాట గుండె ఆగింది..
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విప్లవోద్యమంలో తన పాటలతో ప్రజల్ని చైతన్యపరిచిన కంఠం మూగబోయింది. గత నలభై ఏళ్లుగా అలుపెరగని సాంస్కృతిక కళాకారుడు, సంస్థ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న అరుణోదయ రామారావు (65) తీవ్రమైన గుండెపోటుతో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం అనారోగ్యానికి గురి కావడంతో రాంనగర్‌లోని సౌమ్య ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు చికిత్సకు నిరాకరించారు. దీంతో అక్కడ నుంచి విద్యానగర్‌లోని ఆం్ర«ధ మహిళా సభ ఆస్పత్రికి తీసుకెళ్లగా...డాక్టర్లు పరీక్షించి మైల్డ్ హార్ట్ స్ట్రోక్‌గా ధృవీకరించి ఐసీయూలో ఉంచి వైద్యం చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం వరకు అందరితో మాట్లాడుతూ ఉన్న రామారావు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య అరుణక్క, ఇద్దరు కుమారులు చైతన్య, రాహుల్‌లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత రాయలసీమకు చెందిన రామారావు ఏపీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం ఉదయం 10 గంటలకు అంబర్‌పేట శ్మశానవాటికలో నిర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ‘జనం పాట’ అలా మొదలైంది.. 1955 జూలై 1వ తేదీన కర్నూల్ జిల్లా ఆలూరు మండలం ములగవెల్లిలో రామారావు జన్మించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బీఏ వరకు చదువుకున్న రామారావు తండ్రితో కలసి పౌరాణిక నాటకాలు వేస్తుండేవారు. దీంతో ఇదే ప్రాంతానికి చెందిన సీపీఐ(ఎంఎల్) నాయకుడు చండ్ర పుల్లారెడ్డితో పరిచయం ఏర్పడింది. అలా ఓ రోజు ఆ కాలేజీలో ప్రముఖ గాయకుడు ఘంటసాల పాటల కార్యక్రమం జరుగుతోంది. రామారావు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ‘నమో వెంకటేశ.. నమో తిరుమలేశ..’ పాట పాడారు. అనంతరం ఘంటసాల ఆ పాట పాడిందెవరోనని తెలుసుకుని రామారావును పిలిపించారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో నిర్మాణమవుతున్న ‘మర్యాదరామన్న’ సినిమాలో ‘చెబితే చాలా ఉంది’ అనే పాటను రామారావు చేత పాడించి రికార్డు చేయించారు. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ సినిమా విడుదలైన తరువాత ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాడించిన పాట అందులో ఉంది. దీంతో రామారావు మనస్తాపానికి గుర య్యారు. ఆయనను చండ్ర పుల్లారెడ్డి సముదాయించారు. ‘మనం పాడాల్సింది సినిమా పాటలు కాదు.. జనం పాటలు పాడదాం’ అని విప్లవ ఉద్యమం వైపు తీసుకువచ్చారు. పాటే తోడుగా.. ఆనాటి నుంచి విప్లవ పార్టీతో పూర్తి సంబంధాలు ఏర్పరచుకున్న రామారావు..1977లో కానూరి వెంకటేశ్వరరావు నాయకత్వంలో తొలిసారి ఉస్మానియావర్సిటీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్ఫీదు పొందడానికి వచ్చారు. అప్పటికే ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాత జీవితం గడుపుతున్న రామారావు తన పాటలతో ప్రజల్ని ఉర్రూతలూగించారు. రామారావు పాటలకు వస్తున్న ఆదరణ చూసిన ప్రభుత్వం కనిపిస్తే కాల్చివేయండంటూ ఉత్తర్వులు జారీ చేసింది. నాటి ఎమర్జెన్సీలో అప్పటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామనర్సయ్యను ప్రభుత్వం కాల్చిచంపింది. ప్రతి పాటకు సొంతం ట్యూన్ కట్టడంలో దిట్టైన రామారావు.. ‘అన్నా అమరుడురా..మన రామనర్సయ్య’, ‘అడవి ఏడ్చింది పెద్దన్న ఏడని’వంటి పాటలు పాడి ప్రజల్ని చైతన్య పరిచారు. ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా అందులో పాడకుండా తను పాటను అమ్మనని, పాటే తనకు ప్రాణమని కరాఖండిగా తేల్చి చెప్పిన నిబద్ధత ఆయనది. ఖమ్మం జిల్లా పిండప్రోలు సమీపంలోని పాపయ్యగూడెంకు చెందిన అరుణ ఇంటికి పార్టీ పెద్దలు అనేకమంది వచ్చి పోతుండేవారు. ఆమె పార్టీతో అనుబంధం పెంచుకుని దళాల్లోకి పని చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చండ్రపుల్లారెడ్డితో తిరుగుతున్న రామారావుకు అరుణక్కతో ఆయనే దగ్గరుండి వివాహం జరిపించారు. ప్రముఖుల సంతాపం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేత నారాయణ, మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా, తెలుగు వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృçష్ణ మాదిగ, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తదితరులు రామారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రామారావు మృతి పట్ల సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటించింది. సినీ రచయిత సుద్ధాల అశోక్‌తేజ, ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్, సీపీఎం రాష్ట్ర నాయకులు రాములు, విరసం నేత వేణుగోపాల్, విమల, జనశక్తి నేత అమర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కవి జయరాజ్, పీవోడబ్ల్యూ సంధ్య, మానవ హక్కుల వేదిక నాయకుడు జీవన్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి యశ్పాల్, టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, ప్రొఫెసర్ ఖాసీం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకటరామయ్య, ప్రొఫెసర్ రమా మెల్కొటే, కవి నిఖిలేశ్వర్, ఏపీ అరుణోదయ సమాఖ్య సభ్యులు సన్నశెట్టి రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు. ‘పాట గుండె ఆగింది.. అరుణోదయ రామారావు స్వరం ఆగింది’ అంటూ అరుణోదయ రామారావుకు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ కవితా నివాళి అర్పించారు. -
సిరిగంధం పంచిన నాటిక
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: జాతీయ స్థాయి హనుమ అవార్డ్స్ నాటక పోటీల్లో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్న నాటకా లు ఆలోచనాత్మకంగా సాగుతున్నాయి. శనివారం నాలుగో రోజు ప్రదర్శించిన సాంఘిక నాటికలు ‘నేటి ఆధునిక యుగంలో చెల్లాచెదురైన ఉమ్మడి కుటుంబాలు, తెగిపోతున్న పేగుబంధాలు, కనుమరుగవుతున్న మానవీయ విలువలు, పాడైపోతున్న వ్యవస్థ వంటి అంశాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించి ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తించారు. మంచిని పెంచి, ధర్మాన్ని ఎంచి, మానవీయ విలువలతో కూడిన అనుబంధాలను పంచుతూ మనిషి మనిషిగా బతికే సమాజం రావాలని, కావాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మంచితనం శత్రువునైనా మిత్రుడ్ని చేస్తుంది మనిషిలో చెడుని వదిలేసి మంచిని మాత్రమే తీసుకుంటే క్రూరుడైన శత్రువు కూడా మంచి మిత్రుడుగా మారుతాడనే సందేశాన్ని ‘సిరి గంధం’ సాంఘిక నాటిక చాటింది. విశాఖపట్నం నటరాజ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నాటిక సాగింది. మూర్ఖత్వం నిండిన మార్కండేయుడు చివరకు మంచితనానికి అలవాటు పడి మానవత్వం చూపినా అతన్ని ఎవరూ నమ్మరు. అయితే మార్కండేయుడిలో మార్పును గుర్తించిన కోడలు ఆయనను ఆదరించి గౌరవిస్తుంది. మనిషిలో చెడును విస్మరించి మంచిని గుర్తిస్తే శత్రువు కూడా మంచిగా మారుతాడనే కోడలి మాటలకు ఉద్వేగానికి లోనై ఆనందంతో కన్నుమూస్తాడు. ఉర్రూతలూగించిన నృత్యాలు అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డు పోటీల్లో భాగం గా శనివారం ఉదయం కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద బృంద నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. వివిధ ప్రాంతాలకు చెంది న చిన్నారులు కొండజాతి సంస్కృతులు, గ్రామదేవత జాతర, పల్లెవాసుల జీవన శైలి వంటి నృత్యాలతో చూపరులను ఆకట్టుకున్నారు. తల్లిదండ్రులను విస్మరించే వారే నిజమైన దొంగలు తల్లిదండ్రుల శ్రమని, సేవలను విస్మరించి వారిని అవసాన దశలో వదిలేసే వారే నిజమైన దొంగలని కళాకారులు ‘దొంగలు’ నాటిక ద్వారా ఒక హెచ్చరిక చేశారు. కలియుగం కరెన్సీ యుగంగా మారింది. డబ్బులు, నగలు, వ్యక్తిత్వ హోదాలతో జీవనం సాగించే నేటి పరిస్థితుల్లో బిడ్డల ప్రేమకు దూరమై దుర్భర జీవితాలు అనుభవిస్తున్న వారి దుస్థితిని ‘దొంగలు’ నాటిక కళ్లకు కట్టినట్టు ఆవి ష్కరించింది. కరీంనగర్ చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఈ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఒట్టిపోయిన పశువులను కబేళాలకు, వృద్ధులను ఓల్డేజ్ హోమ్‌కు తరలించే సంఘటనలు అందరి నీ ఆలోచింపజేశాయి. రేపు వృద్ధులు కాబోతున్న కోట్లాది మంది యువతీ యువకులకు ఈ సమ స్య రాకూడదని, సమాజంలో మార్పు రావాలని ఈ నాటిక ద్వారా పిలుపునిచ్చారు. అలరించిన నలదమయంతి నలదమయంతి పద్యనాటకం అలరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సాంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో ప్రదర్శించారు. తమ నటనాభినయంతో నలదమయంతి చరిత్ర ను ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.