సిరిగంధం పంచిన నాటిక | Girls play sirigandham | Sakshi
Sakshi News home page

సిరిగంధం పంచిన నాటిక

Published Sun, Feb 9 2014 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

సిరిగంధం పంచిన నాటిక

సిరిగంధం పంచిన నాటిక

తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: జాతీయ స్థాయి హనుమ అవార్డ్స్ నాటక పోటీల్లో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో ప్రదర్శిస్తున్న నాటకా లు ఆలోచనాత్మకంగా సాగుతున్నాయి. శనివారం నాలుగో రోజు ప్రదర్శించిన సాంఘిక నాటికలు ‘నేటి ఆధునిక యుగంలో చెల్లాచెదురైన ఉమ్మడి కుటుంబాలు, తెగిపోతున్న పేగుబంధాలు, కనుమరుగవుతున్న మానవీయ విలువలు, పాడైపోతున్న వ్యవస్థ వంటి అంశాలను కళ్లకు కట్టినట్టు ప్రదర్శించి ప్రేక్షకుల్లో ఆలోచనలు రేకెత్తించారు. మంచిని పెంచి, ధర్మాన్ని ఎంచి, మానవీయ విలువలతో కూడిన అనుబంధాలను పంచుతూ మనిషి మనిషిగా బతికే సమాజం రావాలని, కావాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారు.
 
మంచితనం శత్రువునైనా మిత్రుడ్ని చేస్తుంది
 
మనిషిలో చెడుని వదిలేసి మంచిని మాత్రమే తీసుకుంటే క్రూరుడైన శత్రువు కూడా మంచి మిత్రుడుగా మారుతాడనే సందేశాన్ని ‘సిరి గంధం’ సాంఘిక నాటిక చాటింది. విశాఖపట్నం నటరాజ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ నాటిక సాగింది. మూర్ఖత్వం నిండిన మార్కండేయుడు చివరకు మంచితనానికి అలవాటు పడి మానవత్వం చూపినా అతన్ని ఎవరూ నమ్మరు. అయితే మార్కండేయుడిలో మార్పును గుర్తించిన కోడలు ఆయనను ఆదరించి గౌరవిస్తుంది. మనిషిలో చెడును విస్మరించి మంచిని గుర్తిస్తే శత్రువు కూడా మంచిగా మారుతాడనే కోడలి మాటలకు ఉద్వేగానికి లోనై ఆనందంతో కన్నుమూస్తాడు.
 
ఉర్రూతలూగించిన నృత్యాలు
 
అభినయ ఆర్ట్స్ హనుమ అవార్డు పోటీల్లో భాగం గా శనివారం ఉదయం కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ, జానపద బృంద నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. వివిధ ప్రాంతాలకు చెంది న చిన్నారులు కొండజాతి సంస్కృతులు, గ్రామదేవత జాతర, పల్లెవాసుల జీవన శైలి వంటి నృత్యాలతో చూపరులను ఆకట్టుకున్నారు.
 
తల్లిదండ్రులను విస్మరించే వారే నిజమైన దొంగలు

తల్లిదండ్రుల శ్రమని, సేవలను విస్మరించి వారిని అవసాన దశలో వదిలేసే వారే నిజమైన దొంగలని కళాకారులు ‘దొంగలు’ నాటిక ద్వారా ఒక హెచ్చరిక చేశారు. కలియుగం కరెన్సీ యుగంగా మారింది. డబ్బులు, నగలు, వ్యక్తిత్వ హోదాలతో జీవనం సాగించే నేటి పరిస్థితుల్లో బిడ్డల ప్రేమకు దూరమై దుర్భర జీవితాలు అనుభవిస్తున్న వారి దుస్థితిని ‘దొంగలు’ నాటిక కళ్లకు కట్టినట్టు ఆవి ష్కరించింది. కరీంనగర్ చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ఈ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఒట్టిపోయిన పశువులను కబేళాలకు, వృద్ధులను ఓల్డేజ్ హోమ్‌కు తరలించే సంఘటనలు అందరి నీ ఆలోచింపజేశాయి. రేపు వృద్ధులు కాబోతున్న కోట్లాది మంది యువతీ యువకులకు ఈ సమ స్య రాకూడదని, సమాజంలో మార్పు రావాలని ఈ నాటిక ద్వారా పిలుపునిచ్చారు.
 
అలరించిన నలదమయంతి

నలదమయంతి పద్యనాటకం అలరించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సాంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో ప్రదర్శించారు. తమ నటనాభినయంతో నలదమయంతి చరిత్ర ను ఆవిష్కరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement