Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు! | MahaKumbh Mela 2025: Karnataka Couple Converts Innova Into House | Sakshi
Sakshi News home page

Maha Kumbh Mela 2025 : ఏకంగా ఇంటినే వెంట తెచ్చుకున్న దంపతులు!

Jan 29 2025 12:57 PM | Updated on Jan 29 2025 1:10 PM

MahaKumbh Mela 2025: Karnataka Couple Converts Innova Into House

‘‘ఆలోచనల్లో పదును ఉండాలేగాని ఆవాసాలకు కొదవేముంది?’’ అన్నట్టుగా ఉంది ఆ దంపతలు తీరు. కాదేదీ నివాసానికి అనర్హం అంటూ వారు సృష్టించిన సరికొత్త  కదిలే ఇల్లు  అందరినీ ఆకట్టుకుంటోంది. ఆధ్యాత్మిక యాత్రకు సృజనాత్మకత రంగరించిన వారి ప్రయాణం చూపరుల ప్రశంసలకు నోచుకుంటోంది.

ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌ ప్రస్తుతం ఓ జంటకు నివాసంగా మారింది. అక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకుని నివాసాలకు ఇబ్బందిని ముందే గ్రహించిన కర్ణాటకకు చెందిన  దంపతులలు ఓ వినూత్న తరహా ఇంటికి  రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ నివాసం  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. 

అంతేకాదు డబుల్‌ డెక్కర్‌ కారును ప్రదర్శించేలా ఉన్న వీరి ఇంటి వీడియో పారిశ్రామిక ప్రముఖులను కూడా ఆకర్షిస్తోంది. అదే విధంగా ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా దృష్టిని సైతం ఆకట్టుకుంది. విశిష్టమైన మార్పులు  ఆవిష్కరణలతో వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మహీంద్రా ఈ క్రియేషన్‌ వెనుక ఉన్న చాతుర్యం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది, ‘అవును, నేను అలాంటి మార్పులు  ఆవిష్కరణలకు నేను ఆకర్షితుడిని అవుతాను అనేది ఖచ్చితంగా నిజం. అయితే అది మహీంద్రా వాహనంపై ఆధారపడినప్పుడు, నేను మరింత ఆకర్షితుడని  అవుతా‘ అని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఈ వీడియోను ఉద్దేశించి హిందీలో ఒక పోస్ట్‌లో తెలిపారు.

ఇన్నోవాయే ఇల్లుగా మారింది...
ఈ కారు పేరు  టయోటా ఇన్నోవా కాగా అదే వీరి  మొబైల్‌ హోమ్‌గా రూపాంతరం చెందింది.ఈ రకమైన మార్పు చేర్పులు, సవరణలకు దాదాపు రూ. 2 లక్షలు పైగానే ఖర్చయిందని ఆ ‘ఇంటికా’కారు యజమాను వెల్లడించారు. రూఫ్‌టాప్‌ టెంట్‌కు రూ. 1 లక్ష ..  పూర్తిస్థాయి వంటగదికి రూ.1లక్ష పర్యావరణ హితమైన రీతిలో  వారి విద్యుత్‌ అవసరాలను తీర్చడానికివాహనం  సోలార్‌ ప్యానెల్‌ను కూడా వీరు ఏర్పాటు చేసుకున్నారు.

ఈ జంట తమ అనుకూలీకరించిన సెటప్‌ను పూర్తిగా ఉపయోగించుకుని, వీలైనంత ఎక్కువ కాలం కుంభమేళాలో ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇంటిని మిస్‌ అవుతున్న ఫీలింగ్‌ ఏమీ రాకపోవడం వల్లనో ఏమో... కుంభ్‌ మేళా అనంతరం కూడా తమ ఇంటికారులో షికారు కంటిన్యూ చేయాలని వీరు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

రోడ్‌ ట్రిప్‌కు సై...
ఈవెంట్‌లో ఆథ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించిన తర్వాత, ఈ వాహనం మీద వారు ఆరు నెలల పాటు సుదీర్థమైన రోడ్‌ ట్రిప్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు, అందులో భాగంగా వీరు విదేశాల్లోకి అంటే... నేపాల్‌లోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ వాహనానికి అభిమాని అయిన భర్త తాను రాబోయే రోడ్‌ ట్రిప్‌ కోసం మరింత ఆసక్తిగా ఉన్నట్టుగా తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భార్య తమ వంట అవసరాల కోసంఇ–కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా సౌకర్యవంతంగా తాజా కూరగాయలను ఆర్డర్‌ చేస్తూన్నానని తెలిపారు.

ఈ  భార్యాభర్తల ఐడియాను చూపిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో అనేకమంది ప్రశంసలకు నోచుకుంది.   ఈ జంట  సృజనాత్మకత, సమయానుకూలతను నెటిజన్లు  కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా ‘జుగాద్‌‘ (వినూత్న పరిష్కారాలు)లో ఇటీవల భారతీయులు బాగా రాణిస్తున్నారనే విషయాన్ని పలువురు హైలైట్‌ చేస్తూ వారి వనరులను ప్రశంసిస్తూ చేసే కామెంట్స్‌ వెల్లువెత్తాయి. మరికొందరు ‘పర్ఫెక్ట్‌ క్యాంపింగ్‌ వ్యాన్‌‘ అనే భావనను మెచ్చుకున్నారు వినూత్న తరహాలో వాన్‌ లైఫ్‌ డ్రీమ్‌ను జీవించినందుకు జంటను అభినందించారు. ఓ అవసరం నుంచి పుట్టిన సృజనాత్మకత వాహనాలను చక్రాలపై అసాధారణ నివాసాలుగా మార్చింది.   ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలకు నోచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement