ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో దేశవిదేశాలకు చెందినవారు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు (గురువారం) పవిత్ర తీవేణీ సంగమంలో పది దేశాల నుంచి వచ్చిన 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం పవిత్ర స్నానాలు ఆచరించనుంది. వీరి పర్యటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యావేక్షిస్తోంది.
నేడు ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో పవిత్ర స్నానాలు ఆచరించే ప్రతినిధి బృందంలో ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యూఎఈ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈ పుణ్యస్నానాలు ఆచరించే ముందు ఈ బృందం సభ్యులు వారసత్వ నడకను చేపట్టారు. ఈ సందర్భం వీరు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని తెలుసుకున్నారు. వీరు బస చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది.
ఈ ప్రతినిధి బృందం పుణ్యస్నానాలు ఆచరించిన అనంతం హెలికాప్టర్(Helicopter) ద్వారా మహా కుంభ్ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేయనుంది. కాగా గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళాకు 45 కోట్ల మంది వరకూ యాత్రికులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment