రూ.330 కోట్లతో హైఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్
Published Wed, Aug 10 2016 12:10 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM
ట్రాన్స్‌కో సూపరిండెంట్ ఇంజనీర్ కళాధర్‌రావు
నాయుడుపేట : జిల్లాలో రూ.330 కోట్లతో హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌కు ప్రణాళికను సిద్ధం చేసినట్లు విద్యుత్ శాఖ సూపరిండెంట్ ఇంజనీర్ కళాధర్‌రావు అన్నారు. నాయుడుపేట విద్యుత్‌శాఖ సబ్ డివిజినల్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రూ.100 కోట్లుతో రూరల్, అర్బన్ డివిజన్‌లలో పనులు ప్రారంభించామన్నారు. పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లు స్థానంలో చిన్న ట్రాన్స్‌ఫ్మార్మర్లు ఏర్పాటుచేయడంతో విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. దీంతో విద్యుత్ చౌర్యానికి అవకాశం లేకుండాపోతుందని చెప్పారు. జవాబుదారీతనం పెంచేందుకు అధికారి స్థాయి నుంచి ఈ సంవత్సరం నుంచి జూనియర్ లైన్‌మన్ వరకు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో నాయుడుపేట సబ్ డివిజన్ డీఈ శ్రీనివాసులు, ఏడీఈ ప్రభాకర్, ఏఈలు నాగరాజు, చిన్నయ్య పాల్గొన్నారు.
Advertisement