ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ముస్లింలు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా మైదానాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానంలో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కలెక్టర్ అహ్మద్ బాబు పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు నాయకులు అలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అనిల్ కుమార్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలకు హాజరయ్యారు. జాతీయ రహదారిపై ప్రార్థనలు చేయడంతో పోలీసులు వాహన రాకపోకలను దారి మళ్లించారు.
మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్, అండలమ్మ కాలనీల్లోని ఈద్గాల్లో, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాలలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, మున్సిపల్ చైర్మన్ కృష్ణారావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవికుమార్ ముస్లింలు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్‌లో ఈద్-ఉల్-ఫితర్‌ను ఘనంగా నిర్వహించారు. ఉదయమే పట్టణంలోని ఈద్గా వద్దకు ముస్లింలు చేరుకుని ప్రార్థనలు చేశారు. వీరికి వైఎస్సార్ సీపీ సీజీసీ మెంబర్, మాజీ ఎంపీ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.శ్రీహరిరావు, టీడీపీ రాష్ట్ర నాయకుడు కె.భూషణ్‌రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి మండలంలోని తాండూర్, నెన్నెల, కాసిపేట ప్రాంతాల్లో రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వర్షం కారణంగా మసీదుల్లో ప్రార్థనలు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నూర్ పట్టణంలోని జామా మసీదులో మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సుల్తాన్ అహ్మద్ ప్రార్థనలు చేశారు.
భైంసా పట్టణంలో బీఏ పాని గుట్టపై ముస్లిం సోదరులు వేలాదిగా తరలివచ్చారు. భైంసా డీఎస్పీ దేవిదాస్‌నాగుల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. బీఏ పాని గుట్ట సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావుపటేల్, ఏఎంసీ చైర్మన్ విఠల్‌రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. భైంసా, ముథోల్, కుంటాల, లోకేశ్వరం, తానూరు మండలాల్లోనూ రంజాన్ వేడుకలు జరిగాయి. కాగజ్‌నగర్ నియోజకగర్గంలోని అన్ని మండలాల్లో రంజాన్ పండుగను గనంగా జరుపుకున్నారు. కాగజ్‌నగర్ టౌన్, సిర్పూర్-టి, కౌటాల, బెజ్జూరు, దహెగం ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో రంజాన్
Published Sat, Aug 10 2013 3:21 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement