
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని నిమూచ్ జైలు నుంచి నలుగురు ఖైదీలు తప్పించుకోని పారిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీసులు ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. పారిపోయిన నలుగురిలో ఇద్దరు గంజాయి, మరో ఇద్దరు హత్యానేరం మోపబడిన ఖైదీలు ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఘటనపై ఆరాతీసిన జైలు సూపరింటెండెంట్.. మధ్యప్రదేశ్, రాజస్తాన్ సరిహద్దుల్లో వారికోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. పారిపోయిన వారిలో నార్‌సింగ్ (20) పంకజ్ మోంగియా (21) లేఖరాం (29), దూబేలాల్ (19) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని పట్టించిన వారికి 50వేల రూపాయల నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు.