ఖైదీలకు ‘ఉపాధి’ నైపుణ్య శిక్షణ | Skills Devolopment training For Prisoners In PSR Nellore | Sakshi
Sakshi News home page

ఖైదీలకు ‘ఉపాధి’ నైపుణ్య శిక్షణ

Published Tue, Jul 3 2018 1:25 PM | Last Updated on Tue, Jul 3 2018 1:25 PM

Skills Devolopment training For Prisoners In PSR Nellore - Sakshi

కంప్యూటర్‌ శిక్షణ పొందుతున్న ఖైదీలు

నెల్లూరు : కారాగారాల్లో శిక్ష, రిమాండ్‌ అనుభవిస్తున్న ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన తర్వాత ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని అందించేందుకు జైళ్ల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో కం ప్యూటర్, టైలరింగ్, తాపీ, హౌస్‌ వైరింగ్, డెయిరీ ఫాం తదితర వాటిపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారుు. అందులో భాగంగా చెముడుగుంట లోని జిల్లా కేంద్రకారాగారంలో రిమాండ్, శిక్ష ఖైదీ లను బ్యాచ్‌లుగా విభజించి 60 రోజుల పాటు ఉ చితంగా కంప్యూటర్‌ పరిజ్ఞానంపై శిక్షణనందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు గాను 45 కంప్యూటర్లను స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు కారాగారంలో ఏర్పాటు చేశారు.

  సోమవారం కేంద్రకారాగార సూపరిం టెండెంట్‌ ఎంఆర్‌ రవికిరణ్, ఏపీ స్టార్స్‌ ప్రిన్సిపల్‌ ఎస్‌. రాజేశ్వరరావు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ అబ్దుల్‌ ఖయ్యూం ఖైదీలకు  కం ప్యూటర్‌ శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఖైదీలకు కంప్యూటర్‌ పరి జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను, స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ సందర్భంగా కారా గార సూపరింటెండెంట్‌ ఎంఆర్‌ రవికిరణ్‌ మాట్లాడు తూ జైలు జీవనం అనంతరం ఖైదీలు తమ సొంతకాళ్లపై నిలబడి జీవించాలన్న లక్ష్యం గా జైళ్లశాఖ పలు  చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధి కారుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్ర కారాగారాల్లోని రిమాండ్, శిక్ష ఖైదీలకు 60 రోజు లు, 45 రోజుల సర్టిఫికెట్‌ కోర్సులు నిర్వహిస్తోందన్నారు. శిక్షణనిచ్చి కోర్సు పూర్తయిన తర్వా త సరి ్టఫికెట్లు ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని ఖైదీ లం దరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. రెండు, మూడు రోజుల్లో టైలరింగ్, హౌస్‌ వైరింగ్, డెయిరీ తదితరాలకు సంబంధించి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు రవికిరణ్‌ చెప్పారు.

రూ.4.25 లక్షలతో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్ర కారాగారాల్లో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటుకు జైళ్ల శాఖ చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్ర కారాగారానికి జైళ్లశాఖ రూ.4. 25 లక్షల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే విశాఖ కారాగారంలో డిజిటల్‌ లైబ్రరీ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా గత నెల 30వ తేదీన జిల్లా కేంద్ర కారాగారంలో డిజిటల్‌ లైబ్రరీ ని ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్‌ బీవీ రమేష్‌కుమార్,  జైలర్లు ఎ.కాంతరాజు, ఎస్‌. శివప్రసాద్‌. టీచర్‌ సీహెచ్‌ విజయకుమార్, సైన్‌క్రో సర్వ్‌గ్లోబల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ప్రతినిధి విద్యాసాగర్, కారాగార సిబ్బంది,  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement