computer training
-
ఖైదీలకు ‘ఉపాధి’ నైపుణ్య శిక్షణ
నెల్లూరు : కారాగారాల్లో శిక్ష, రిమాండ్ అనుభవిస్తున్న ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన తర్వాత ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడేందుకు వివిధ అంశాల్లో నైపుణ్యాన్ని అందించేందుకు జైళ్ల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాల్లో కం ప్యూటర్, టైలరింగ్, తాపీ, హౌస్ వైరింగ్, డెయిరీ ఫాం తదితర వాటిపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారుు. అందులో భాగంగా చెముడుగుంట లోని జిల్లా కేంద్రకారాగారంలో రిమాండ్, శిక్ష ఖైదీ లను బ్యాచ్‌లుగా విభజించి 60 రోజుల పాటు ఉ చితంగా కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణనందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు గాను 45 కంప్యూటర్లను స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు కారాగారంలో ఏర్పాటు చేశారు. సోమవారం కేంద్రకారాగార సూపరిం టెండెంట్ ఎంఆర్ రవికిరణ్, ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్ ఎస్. రాజేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం ఖైదీలకు కం ప్యూటర్ శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఖైదీలకు కంప్యూటర్ పరి జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను, స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ సందర్భంగా కారా గార సూపరింటెండెంట్ ఎంఆర్ రవికిరణ్ మాట్లాడు తూ జైలు జీవనం అనంతరం ఖైదీలు తమ సొంతకాళ్లపై నిలబడి జీవించాలన్న లక్ష్యం గా జైళ్లశాఖ పలు చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధి కారుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్ర కారాగారాల్లోని రిమాండ్, శిక్ష ఖైదీలకు 60 రోజు లు, 45 రోజుల సర్టిఫికెట్ కోర్సులు నిర్వహిస్తోందన్నారు. శిక్షణనిచ్చి కోర్సు పూర్తయిన తర్వా త సరి ్టఫికెట్లు ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని ఖైదీ లం దరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. రెండు, మూడు రోజుల్లో టైలరింగ్, హౌస్ వైరింగ్, డెయిరీ తదితరాలకు సంబంధించి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు రవికిరణ్ చెప్పారు. రూ.4.25 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లా కేంద్ర కారాగారాల్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు జైళ్ల శాఖ చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్ర కారాగారానికి జైళ్లశాఖ రూ.4. 25 లక్షల నిధులను మంజూరు చేసింది. ఇప్పటికే విశాఖ కారాగారంలో డిజిటల్ లైబ్రరీ సేవలు అందుబాటులో ఉండగా తాజాగా గత నెల 30వ తేదీన జిల్లా కేంద్ర కారాగారంలో డిజిటల్ లైబ్రరీ ని ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ బీవీ రమేష్‌కుమార్, జైలర్లు ఎ.కాంతరాజు, ఎస్. శివప్రసాద్. టీచర్ సీహెచ్ విజయకుమార్, సైన్‌క్రో సర్వ్‌గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధి విద్యాసాగర్, కారాగార సిబ్బంది, పాల్గొన్నారు. -
16 నుంచి శిక్షణ
ఎస్కేయూ : నిపుణ శిక్షణ ద్వారా అర్హులైన అంధులకు, వికలాంగులకు, పేదలకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిపుణ ఏపీ ఇన్చార్జ్ పీవీకే శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. బీపీఓ శిక్షణ, కంప్యూటర్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9490702460 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. -
యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
వికారాబాద్ రూరల్ : జిల్లాలోని పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలలోపు వారందరికీ ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తామని నెట్వల్డ్ సోల్యూషన్ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో కంప్యూటర్‌కు సంబంధించి వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉంటాయన్నారు. పట్టణంలోని రామయ్యగూడ రోడ్డులో ఉండే ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి వచ్చి చేరాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్: 91773 83102, 90636 58771లలో సంప్రదించాలన్నారు. -
లెక్చరర్లకు కంప్యూటర్ శిక్షణ
కాజీపేట రూరల్ : జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఈనెల 12 నుంచి 17 వరకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేటలోని నిట్‌లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్స్ ఐసీటీ అకడమిక్ ద్వారా తక్కువ ఫీజుతో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.ఆంజనేయులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, టూల్స్, ఇంటర్నెట్, ఈ–మెయిల్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ౖyð రెక్టర్, నిట్, వరంగల్ పేరిట తీసిన రూ.200 డీడీతో ప్రిన్సిపాల్ అనుమతి పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఉచిత కంప్యూటర్ కోర్సు శిక్షణ
హైదరాబాద్: నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ న్యూఢీల్లి, తెలంగాణా స్టేట్ స్కిల్ అండ్ స్కిల్ నాలేడ్జ్(టాస్క్) సంయుక్త ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్స్ సిస్టం డిజైన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్హత కనీసం 8వ తరగతి ఉండాలి. డిప్లొమా ఇన్ డిగ్రీలో ఆసక్తి గలవారు తమ సరిఫికెట్స్తో కార్ఖనా బస్‌స్టాప్ సమీపనా ఉన్న కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 9618066663 సంప్రదించవచ్చు. అంతే కాకుండా , టోలిచౌకి సమీపాన ఉన్నవారు మైహోం రెయిన్బో అపార్ట్మెంట్స్లోని కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకొనే సౌకర్యం ఉంది. -
నిరుద్యోగ యువతకు కుచ్చుటోపీ ?
లబ్బీపేట : మూడు వారాల పాటు శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మబలికి వందలాదిమంది నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్న ఓ ప్రైవేటు సంస్థ బాగోతం శనివారం బయట పడింది. సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ రోడ్డులో ఆకాశవాణి సమీపంలో ఓ హోటల్ పక్క భవనంలో కాల్ సెంటర్ ట్రైనింగ్, కంప్యూటర్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీషు పేరుతో ఓ ఇన్స్టిట్యూట్ను నిర్వహిస్తున్నారు. దీనిలో ఒక్కో నిరుద్యో గి నుంచి తొలుత రూ.3 వేలు వసూలు చేస్తారు. వారికి మూ డు వారాల పాటు శిక్షణ పేరుతో రోజుకు గంట చొ ప్పున ఇన్స్టిట్యూట్కు రమ్మంటారు. ఆ సమయంలో ఏమీ చెప్పడం లేదంటూ ఇప్పటికే వారి వద్ద డబ్బు కట్టిన బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఇక్కడ వేలాది మంది నిరుద్యోగులు దోపిడీకి గురవుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో సైతం వందలాది మంది నిరుద్యోగుల బయోడెటా ఫారాలు ఉండటం సంస్థ నిర్వాహకులపై అనుమానానికి తావిస్తోంది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో ఎంతోమంది అక్కడ డబ్బు చెల్లించి శిక్షణకు చేరుతున్నారు. వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వకపోగా, మూ డు వారాలు దాటినా ఉద్యోగాల విషయమై ఏమీ చెప్పకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నా రు. అదేమని ప్రశ్నిస్తే మళ్లీ రూ.3 వేలు చెల్లించి మరో మూడు వారాలు శిక్షణ పొందాలని చెపుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నా రు. ఇలా ఎంతోమంది మోసపోతున్నా ఏమీ చేయలేకపోతున్నట్లు వాపోతున్నారు, ఏదో ఒక చిన్న ఉద్యోగం లభిస్తుందనే ఆశతో చేరితే దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న సూర్యారావుపేట పోలీసులు అక్కడకు వచ్చినప్పటికీ బాధితులు వారికి ఫిర్యాదు చేయలేదు. దీంతో వారు వెనుదిరిగారు. ఒకచోట అవకాశం లేకుంటే మరోచోటకి పంపిస్తాం ఇదిలా ఉండగా ఈ వ్యవహారం గురించి ఇన్స్టిట్యూట్ నిర్వాహకులను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా, తమవద్ద నిరుద్యోగులకు ఉద్యోగాలకు కావాల్సిన శిక్షణ ఇస్తామని తెలిపారు. అనంతరం వివిధ సంస్థల్లో ఖాళీల ఆధారంగా ఇంటర్వ్యూలకు పంపుతామన్నారు. ఒకచోట ఎంపిక కాకపోతే మరోచోటుకు పంపుతామన్నారు. అంతేకాని మరేవిధమైన మోసం లేదని తెలిపారు. అంతా బోగస్ ఉద్యోగాలిప్పిస్తామంటూ శిక్షణ పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఓ యువతిని తమ సంస్థలోనే ఉద్యోగం చేయమంటున్నారు. ఇదేమి అన్యాయం. అంతా బోగస్. నిరుద్యోగులను దోపిడీ చేస్తున్నారు. ఎటువంటి శిక్షణ ఇవ్వనందున మేము చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వాలి. -మనోజ్, బాధితుడు, ఇబ్రహీంపట్నం -
కంప్యూటర్ మిథ్య
ముగిసిన టీచర్ల కాంట్రాక్టు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు కంప్యూటర్ పాఠాలు దూరం పామర్రు : ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ కంప్యూటర్ శిక్షణ అందించాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ లక్ష్యం నీరుగారుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌తో బోధకుల గడువు ముగియడంతో కంప్యూటర్ విద్య మిథ్యగా మారింది. పలు పాఠశాలల్లో కంప్యూటర్ల గదులకు తాళాలు పడ్డాయి. లక్షలాది రూపాయల విలువైన కంప్యూటర్లకు బూజు పడుతోంది. టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కింది. ప్రభుత్వం సమకూర్చిన కంప్యూటర్ సామగ్రి, జనరేటర్లు నిరుపయోగంగా మారాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో బోధకుల కాంట్రాక్ట్ ముగియడంతో విద్యార్థులకు శిక్షణకు దూరమయ్యారు. కార్పొరేట్‌కు దీటుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనూ తీర్చిదిద్దాలనే ఆశయంతో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కంప్యూటర్ విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టారు. పాఠాలు చెప్పేందుకు ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతను అప్పజెప్పారు. జిల్లాలోని 236 సక్సెస్ పాఠశాలల్లో 472 మంది కంప్యూటర్ టీచర్లు పని చేసేవారు. ప్రస్తుతం వారి కాలపరిమితి ముగిసింది. తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం వల్ల రోడ్డన పడ్డారు. పామర్రు మండల పరిధిలోని ఐదు జెడ్పీ పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రారంభించారు. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, జనరేటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ఇద్దరు టీచర్లు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేవారు. లెక్కలు, తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులను ఆడియో వీడియోల ద్వారా విద్యార్థులకు బోధన చేసేవారు. నెల నెలా పరీక్షలు కూడా నిర్వహించేవారు. వైఎస్ అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కంప్యూటర్ విద్యపై దృష్టి పెట్టలేదు. వేతనాలు సరిపోవడం లేదని టీచర్లు నాలుగు నెలలు సమ్మె కంప్యూటర్ శిక్షణ కుంటు పడింది. ఆ తర్వాత ఐదేళ్ల కాంట్రాక్టు గత సెప్టెంబర్‌తో ముగియడంతో ప్రైవేటు సంస్థ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులతో కంప్యూటర్ తరగుతులు కొనసాగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఉపాధ్యాయుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేక శిక్షణ మూలనపడింది. పైగా ఇప్పటికే చాలా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది. కంప్యూటర్ విద్యకు సంబంధించిన ప్రత్యేక టీచర్లు ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వం వెంటనే స్పందించి బోధకులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ప్రైవేటు ఫీసులు
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : ఇబ్బడి ముబ్బడిగా ఫీసులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించే వ్యవస్థ కరువైంది. ఇంగ్లిషు మా ధ్యమం తప్పనిసరైన రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రై వేట్ స్కూళ్లలోనే చేర్పిస్తున్నారు. వీరి బలహీనతను కాన్వెంటు స్కూళ్లు సొమ్ము చేసుకుంటున్నాయి. ఫీజుల మోత మోగిస్తున్నా యి. ఇందుకోసం ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. విద్యాబోధన సరేగాని, దానికి అయ్యే ఖర్చు మాత్రం తల్లిదండ్రులకు మింగుడుపడడం లేదు. ఫీజుల నియంత్రణపై జిల్లా విద్యాశాఖ స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డొనేషన్లు, రూ. వేలల్లో ఫీజులు... ఓ స్థాయి ప్రైవేట్ పాఠశాలలో ఎల్కేజీ ప్రవేశానికి స్కూల్ ఫీజు రూ.8 వేలు ఉండగా, డొనేషన్ల పేరిట రూ.12 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇలా తరగతిని బట్టి డొనేషన్లు రూ.10 వేల నుంచి మొదలుకొని రూ. 25 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎల్ కేజీ, 1వ తరగతికే రూ. 8 వేల ఫీజు ఉండగా, 5 నుంచి 10వ తరగతుల వరకు రూ.10 వేలపైబడి ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటి కి ప్రత్యేకం... కంప్యూటర్ శిక్షణ, ఐఐటీ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్, ప్రత్యేక తరగతుల పేరిట అదనంగా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని మెలిక పెడుతున్నారు. దీనికి రూ. 6 నుంచి రూ. 7 వేలు నిర్ణయిస్తున్నారు. ఇందులో పాఠశాలకు చెందిన ప్రత్యేక స్టడీ మెటీరియల్ అంటగడుతున్నారు. ఒక్కో స్టడీ మెటీరియల్ రూ. 300 వరకు వసూలు చేస్తున్నారు.అలాగే కొన్ని పాఠశాలల్లో స్కూల్ డ్రెస్సులు కొనుగోలు చేయాలని నిబంధనలు పెడుతున్నారు. దీనికి రూ. 600 నుంచి వెయ్యి వరకు డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు వందల రూపాయలు వెచ్చించి టై, బెల్డ్లను కొనుగోలు చేయాల్సి వస్తోంది. వీటితో బస్సు సౌకర్యం కల్పిస్తూ నెలకు రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు ఫీజును నిర్ణయించి గుంజుతున్నారు. దీంతో ఒక్కో విద్యార్థిపై వేలల్లో ఫీజుల భారం పడుతోంది. వీటి ఖర్చులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు ఆస్తులను అమ్మడం, లేకపోతే అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలల ప్రవేశానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించడం, డొనేషన్లు వసూళ్లు చేస్తున్నాయి. వీటి నియంత్రించాల్సిన విద్యాశాఖ స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాఠశాలలు టెక్నో, డిజిటల్, ఐఐటీ తదితర పేరిట బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారాన్ని చేస్తున్నాయి. ఇలా ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినా ఇలా బోర్డులు చేస్తూ అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి.ఏటా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండానే కొనసాగుతున్నాయి. చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండడం లేదు. రేకుల షెడ్లలో తరగతులు నిర్వహించరాద నే నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలో చాలాచోట్ల రేకుల షెడ్లలోనే ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీటన్నింటిపై విద్యాశాఖ పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అంధుల కంప్యూటర్ శిక్షణకు సంపూర్ణ సహకారం
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: అంధుల కంప్యూటర్ శిక్షణకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్రిష్ణానగర్లో జాతీయ అంధుల సమాఖ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంధులైన ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థుల కోసం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్‌ను కలెక్టర్ ప్రారంభించారు. అంధులు ఉపయోగిస్తున్న కంప్యూటర్, సాఫ్ట్‌వేర్‌ను వివరాలను అంధుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు ఆర్ విశ్వనాథరెడ్డి నుంచి తెలుసుకున్నారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అయ్యిందన్నారు. చూపు లేదనే నిరాశను వదలి పెట్టి ఉజ్వల భవిష్యత్తు కోసం అంధులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ అంధులు కళ్లు ఉన్న వారికి ఏమాత్రం తీసి పోరని ప్రస్తుతం ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రమే నిదర్శనమన్నారు. జాతీయ అంధుల సమాఖ్య కర్ణాటక ప్రధాన కార్యదర్శి గౌతం అగర్వాల్, ఎన్‌ఎఫ్‌బీ సౌత్ జోన్ ఉపాధ్యక్షులు గోపాలక్రిష్ణ మాట్లాడుతూ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించవచ్చన్నారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ అంధులకు చేయూతను ఇచ్చేందుకు తాము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు. ఎన్‌ఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ఈ శిక్షణను పొంది తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు ఇమ్మానియేల్ వరప్రసాద్, డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ సిద్దారెడ్డి, ఎన్‌ఎఫ్‌బీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు.