
ప్రతీకాత్మక చిత్రం
బనశంకరి: మంగళూరు జిల్లా జైలులో ఖైదీలు పరస్పరం దాడులకు దిగడంతో ఇద్దరు గాయపడ్డారు. పణంబూరు పోలీస్‌స్టేషన్‌లో దోపిడీ కేసులో అరెస్టయి జైలులో ఉన్న సమీర్ అనే ఖైదీ ఇతర ఖైదీలపై దాడికి దిగాడు. మూల్కి పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన అన్సార్‌పై ఆదివారం ఉదయం దాడికి దిగాడు. దాడిలో అన్సార్‌తో పాటు మూడిబిదిరే దోపిడీ కేసులో ఉన్న ఖైదీ జైనుద్దీన్ కూడా గాయపడ్డాడు. వీరిని ఆస్పత్రికి తరలించారు. మంగళూరు జైలును పోలీస్ కమిషనర్ శశికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా జైలులోని ఇతర ఖైదీలు గట్టిగా కేకలు వేయడంతో పోలీసులు వారిపై లాఠీ ఝుళిపించారు.